Breaking News

తెలుగు భాషా పరిరక్షకులు డా.మండలి బుద్ధప్రసాద్ కి, కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారం

-మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చే బహూకరణ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు భాషా పరిరక్షకులు, మాజీ ఉపసభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ “కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని” అందుకున్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్..నృత్య కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో శక పురుషులు, పూర్వ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా.ఎన్.టి.రామారావు శత జయంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి డా.మండలి బుద్ధప్రసాద్ కి కిన్నెర..ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారాన్ని బహూకరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాలి రఘురామ్ ల ఆధ్వర్యంలో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ మాజీ ఉప రాష్ట్రపతి డా.ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా డా.బుద్ధప్రసాద్ కి పురస్కారం అందించి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కెవి.రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.భవానీ ప్రసాద్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, శ్రీ డెవలపర్స్ ఎండి భోగరాజు మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *