Breaking News

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ముఖ్య అతిథిగా అమరావతి నందు అత్యంత కోలాహలంగా జరిగిన

-ఆర్ 5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంకవాసుల సొంతింటి కలను సాకారం చేస్తూ వారికి అమరావతి నందు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన జగనన్నకు నియోజకవర్గ ప్రజలందరి తరపున అవినాష్ ధన్యవాదాలు తెలియజేశారు.సామాజిక అమరావతి ధ్యేయంగా పేదలకు అమరావతి లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇళ్ళ స్థలాలను స్మశానం తో పోల్చిన చంద్రబాబు నాయుడు కి ఇవే చివరి ఎన్నికలు అని అవినాష్ ఘాటుగా విమర్శించారు.రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు..వేలాదిగా ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చి ముఖ్యమంత్రి గారికి తమ మద్దతు తెలియజేయడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్రంలో మరలా వైస్సార్సీపీ జెండా ఎగురడం, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *