-జిల్లాకు చెందిన 27,031 మందికి ఇళ్ళ పట్టాల మంజూరు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతి ప్రాంతంలో ఇళ్ళపట్టాలను పంపిణీ చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు అపూర్వమైన గౌరవం ఇవ్వడం చారిత్రాత్మకమైన సంఘటనగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.సీఆర్‌డీఏ పరిధిలోని అమరావతిలో ఆర్ 5 జోన్ నందు పేదలకు మంజూరైనా ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుళ్ళూరు మండలం వెంకట పాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీఆర్‌డీఏ ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేసి పట్టాలను పంపిణీ చేయడం భవిష్యత్‌లో చారిత్రాత్మకమైన నిర్ణయంగా నిలిచిపోతుందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్ 5 జోన్ నందు 14 లేఅవుట్లలో ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన 27,031 మంది మహిళల పేరున పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో బిసి వర్గానికి చెందిన 14,710, ఎస్సీ వర్గానికి చెందిన 2,334, ఎస్టీ వర్గాలకు చెందిన 409 మంది, ఇతర వర్గాలకు చెందిన 9,558 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో పేద మహిళల పేరున లక్షలాది రూపాయల విలువ గల భూములలో ఇళ్ళ పట్టాలను కేటాయించడం సాధారణమైన విషయం కాదన్నారు. పేదలకు మంజూరు చేసిన లేఅవుట్ల వద్దకు వారం రోజులలో లబ్దిదారులను తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలోనే జియో ట్యాగింగ్ చేసి పట్టాలను అందజేసి లబ్దిదారుల నుండి ఆప్షన్ తీసుకోనున్నామన్నారు. లేఅవుట్లలో నిర్మించే హౌసింగ్ కాలనీలలో గృహాలను నిర్మించుకునేందుకు లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పేద మహిళల ముఖాలలో సంతోషం వెల్లివిరిసిందని ఇంతటి ప్రాముఖ్యమైన ప్రాంతంలో సొంత ఇళ్ళు నిర్మించుకుంటున్నామనే భావనతో ఒకింత విస్మయాన్ని వ్యక్తం చేస్తూ లబ్దిదారులు ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటున్నారన్నారు. జిల్లాకు చెందిన 27 వేల మంది మహిళలకు ఒకే రోజు సొంత ఇంటి కలను నేరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోమన్‌రెడ్డి పేదల హృదయాలలో నిలిచిపోనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …