Breaking News

పల్నాడు శివారు గ్రామాల్లో మొబైల్ టవర్లు

-అవగాహనా సదస్సులో అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎం.ఎస్. ప్రసన్న కుమార్

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
సిగ్నల్స్ లేని పల్నాడు జిల్లా శివారు గ్రామాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు గుంటూరు టెలికం జిల్లా సేల్స్, మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎం.ఎస్. ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలోని ఎర్రాప్రగడ టెలికాం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల అవగాహనా సదస్సులో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 20 ఎక్చేంజిలు ఉన్నాయని, 2000 ల్యాండ్ లైన్ కనెక్షన్ లు ఉన్నాయన్నారు. అంతేకాక 4,400 ఫైబర్ కనెక్షన్లు ఇంటింటికి అందజేశామన్నారు. ఇప్పటికీ 15 వై.ఫై. పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. నరసరావుపేట డి.ఈ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రైవేటుతో ప్రమేయంలేకుండా చిలకలూరిపేట, నరసరావుపేట కస్టమర్ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్ధానిక ఎస్.డి.ఈ. నాగరాజు మాట్లాడుతూ వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తున్నామన్నారు. జె.టి.ఒ. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి వినియోగదారునికి తమ వంతుగా సేవలు అందిస్తున్నామన్నారు. టెలికం సలహా కమిటి ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ BSNL కు పూర్వ వైభవం చేకూరబోతున్నట్లు, ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 4జి, 5జి సేవలకు వీలుగా BSNL కు 89,047 కోట్ల రూపాయలు కేటాయించటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టెలికం అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *