-‘‘అమృత కాలాన్ని మనం ‘కర్తవ్య కాలం’ గా పిలుచుకొంటున్నాం. ఈ సందర్భం లో మనం చేయవలసిన ప్రతిజ్ఞల లో భవిష్యత్తు కోసం సంకల్పాలు, మన ఆధ్యాత్మిక విలువల యొక్క మార్గదర్శకత్వం చేరిఉన్నాయి’’
-‘‘ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కలిగిన స్థలాల పునరుద్ధరణ చోటుచేసుకొంటుండగా, మరో ప్రక్కసాంకేతిక విజ్ఞానం మరియు ఆర్థిక వ్యవస్థ.. ఈ రెంటి లో కూడా భారతదేశం నాయకత్వంవహిస్తున్నది’’
-‘‘దేశం లో కనిపిస్తున్నటువంటి పరివర్తన సమాజం లోనిప్రతి ఒక్క వర్గం యొక్క తోడ్పాటుల ఫలితమే’’
-‘‘భారతదేశం లో సాధువులు అందరు వేల కొద్దీ సంవత్సరాలనుండి ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను పెంచి పోషిస్తూ వచ్చారు’’
-‘‘భారతదేశం వంటి ఒక దేశం లో, ధార్మిక మరియు ఆధ్మాత్మిక సంస్థ లు సమాజ సంక్షేమం యొక్క కేంద్ర స్థానం లో నిలబడుతూ వచ్చాయి’’
-‘‘సత్య సాయి జిల్లా ను పూర్తి గా డిజిటల్ మాధ్యం లోకిమార్చుతామని మనం ఒక ప్రతిజ్ఞ ను చేయవలసి ఉంది’’
-‘‘పర్యావరణం మరియు దీర్ఘమైన మనుగడ ను కలిగివుండే జీవన శైలి వంటి రంగాల లోభారతదేశం నాయకత్వ స్థానాన్ని సాధించడం కోసం జరిగే అన్ని ప్రయాసల లో సత్య సాయిట్రస్ట్ వంటి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంస్థ లు ఒక గొప్ప భూమిక నుపోషించవలసివుంది’’
పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో ఏర్పాటైనటువంటి సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తం గా పలువురు ప్రముఖుల మరియు భక్తుల సమక్షం లో ఈ ప్రారంభ కార్యక్రమం సంపన్నమైంది.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారందరి కీ అభినందనల ను తెలియ జేశారు. తాను వివిధ కార్యక్రమాల కు హాజరు కావలసి ఉన్న కారణం గా ఈ కార్యక్రమం లో స్వయం గా పాలుపంచుకోలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ ‘‘సత్య సాయి యొక్క ఆశీస్సు లు మరియు ప్రేరణ లు ఈ రోజు న మనతో ఉన్నాయి’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన యొక్క మిశన్ ఈ రోజు న విస్తరించింది, మరి దేశం ‘సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటర్’ పేరు తో ఒక క్రొత్త ప్రధాన సమావేశ కేంద్రాన్ని ప్రారంభించుకొంటున్నందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ క్రొత్త కేంద్రం ఆధ్యాత్మికత తాలూకు అనుభూతి ని మరియు ఆధునికత్వం యొక్క వైభవాన్ని కలబోసుకొని వెలుగొందుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్త పరచారు. ఈ కేంద్రం లో సాంస్కృతిక వైవిధ్యం, భావన పరమైన వైభవం కలబోసుకొన్నాయని, ఇది ఆధ్యాత్మికత్వం మరియు విద్య సంబంధి కార్యక్రమాల కు ఒక కేంద్రీయ బిందువు కాగలుగుతుందని పండితులు మరియు నిపుణులు ఇక్కడ గుమికూడి చర్చలు జరుపుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చేత గా రూపాంతరం చెందే దిశ లో వేగం గా పయనిస్తున్నప్పుడు ఏ ఆలోచన అయినా అత్యంత ప్రభావశీలమైంది గా మారుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటర్ ను దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు శ్రీ సత్య సాయి గ్లోబల్ కౌన్సిల్ యొక్క నేత ల సమావేశం కూడా జరుగుతోందని ఆయన తెలిపారు. ‘అభ్యాసం మరియు ప్రేరణ’ అనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉండడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఇది ప్రభావశీలం గా ఉండడమే కాకుండా ప్రాసంగికం గా కూడా ను ఉంది అని పేర్కొన్నారు. సమాజం యొక్క నాయకులు సత్ప్రవర్తన ను కలిగి ఉండాలి అనే అంశాని కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే సమాజం వారి ని అనుసరిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. శ్రీ సత్య సాయి యొక్క జీవనం దీనికి ఒక సజీవ ఉదాహరణ గా నిలిచింది అని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం భారతదేశం సైతం తన కర్తవ్యాల ను ప్రాధాన్య క్రమం లో నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. స్వాతంత్య్రాని కి వందేళ్ళ మైలు రాయి వైపు కదులుతూ మనం ఈ యొక్క అ మృత కాలాని కి ‘కర్తవ్య కాలం’ అని పేరు ను పెట్టుకొన్నాం. ఈ ప్రతిజ్ఞ లలో మన ఆధ్యాత్మిక విలువ ల యొక్క మార్గదర్శకత్వం మరియు భవిష్యత్తు కు సంబంధించిన సంకల్పాలు భాగం గా ఉన్నాయి. వీటిలో అభివృద్ధి మరియు వారసత్వం.. ఈ రెండూ ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.
ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన స్థలాల పునరుద్ధరణ జరుగుతున్నట్లే, భారతదేశం సాంకేతిక విజ్ఞానం మరియు ఆర్థిక వ్యవస్థ లలో కూడాను నాయకత్వాన్ని వహిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లో అగ్రగామి అయిదు ఆర్థిక వ్యవస్థల లో ఒకటి గా మారింది. ప్రపంచం లో మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ కు భారతదేశం అండదండల ను అందిస్తోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. డిజిటల్ టెక్నాలజీ, ఇంకా 5జి వంటి రంగాల లో ప్రపంచం లోని ప్రముఖ దేశాల తో భారతదేశం పోటీ పడుతోందని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రపంచం లో కెల్లా 40 శాతం రియల్ టైమ్ ఆన్ లైన్ ట్రాన్సాక్శన్స్ భారతదేశం లో చోటు చేసుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. పుట్టపర్తి జిల్లా ను అంతటినీ డిజిటల్ ఇకానమి వైపునకు తీసుకుపోవాలి అని భక్తుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చాలని అంతా ఒక్కటై ముందండుగు వేశారంటే శ్రీ సత్య సాయి బాబా తదుపరి జయంతి కల్లా యావత్తు జిల్లా డిజిటల్ హోదా ను సాధిస్తుంది అని ఆయన అన్నారు.
‘‘దేశం లో చోటు చేసుకొన్న పరివర్తన సమాజం లో ప్రతి ఒక్క వర్గం యొక్క తోడ్పాటుల ఫలితం’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని గురించి మరింత గా తెలుసుకోవడం మరియు ప్రపంచం తో సంధానం కావడం లో గ్లోబల్ కౌన్సిల్ వంటి సంస్థ లు ఒక ప్రభావవంతమైనటువంటి మాధ్యం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రాచీన ధర్మ గ్రంథాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సాధువుల ను పారే నీరు వంటి వారు గా భావించడం జరుగుతోంది, ఇలా ఎందుకు అంటే వారు వారి ఆలోచనల ను ఎన్నటికీ నిలిపి వేయరు, వారు వారి నడవడిక పరం గా ఎన్నటికీ అలసిపోరు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘సాధువుల జీవనం వారి నిరంతర ప్రయాసల లో ప్రతిఫలిస్తూ ఉంటుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఒక సాధువు ఎక్కడ పుట్టాడన్న సంగతి ఆయన అనుచరుల ను ఖాయం చేయదు అని ఆయన అన్నారు. భక్తజనుల దృష్టి లో నిజమైన సాధువు ఎవరు అంటే అది వారి స్వీయ కల్పన ను బట్టే ఉంటుంది. మరి అతడు వారి యొక్క విశ్వాసాల కు మరియు సంస్కృతుల కు ప్రతినిధి గా మారుతాడు అని ప్రధాన మంత్రి అన్నారు. సాధువులు అందరూ భారతదేశం లో వేల సంవత్సరాలు గా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను పెంచి పోషిస్తూ వచ్చారు అని ఆయన అన్నారు. శ్రీ సత్య సాయి బాబా పుట్టపర్తి లో పుట్టినప్పటికీ కూడా ను ఆయన అనుచరుల ను ప్రపంచవ్యాప్తం గా గమనించవచ్చును. మరి ఆయన సంస్థల ను, ఆశ్రమాల ను భారతదేశం లోని ప్రతి రాష్ట్రం లో చూడవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. భక్తజనులంతా భాష మరియు సంస్కృతి వంటి వాటి కి అతీతం గా ప్రశాంతి నిలయం తో ముడిపడ్డారు. మరి ఈ అభిలాషే భారతదేశాన్ని ఒకే సూత్రం లో పెనవేసి శాశ్వతత్వాన్ని సంతరింప చేస్తున్నది అని ఆయన వివరించారు.
సేవ చేసేందుకు ఉండేటటువంటి శక్తి అంశం లో సత్య సాయి ని గురించి ప్రధాన మంత్రి ఉట్టంకించారు. సత్య సాయి తో భేటీ అయ్యే అవకాశాన్ని గురించి మరియు సత్య సాయి యొక్క దీవెనల లో ఆశ్రయాన్ని పొందడాన్ని గురించి కృతజ్ఞత ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. శ్రీ సత్య సాయి ఎంతో సులువు గా భావ గర్భితం అయినటువంటి సందేశాల ను చాటే వారు అని శ్రీ నరేంద్ర మోదీ జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు. ‘అందరిని ప్రేమించడం, అందరి కి సేవ చేయడం’; ‘ఎప్పటికీ సాయపడడం, ఎవరిని బాధించకపోవడం’; ‘తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పని ని చేయడం’; ‘ప్రతి ఒక్క అనుభం ఒక పాఠమే – ప్రతి ఒక్క నష్టం లోనూ లాభం దాగివుంటుంది’ వంటి చిరకాలిక ప్రబోధాల ను ఆయన స్ఫురణ కు తెచ్చారు. ‘‘ఈ బోధనల లో సూక్ష్మగ్రాహ్యత తో పాటు జీవనాని కి సంబంధించిన ఒక గాఢమైన తర్కం కూడా ఇమిడి ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గుజరాత్ లో భూకంపం సంభవించినప్పుడు సత్య సాయి అందించిన మార్గదర్శకత్వం మరియు చేసిన సాయాల ను ప్రధాన మంత్రి తలచుకొన్నారు. శ్రీ సత్య సాయి యొక్క ప్రగాఢమైన దయాపూరిత ఆశీర్వాదాల ను శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొంటూ ‘మానవ సేవే – మాధవ సేవ’ అని సత్య సాయి తలపోశారు అని పేర్కొన్నారు.
భారతదేశం వంటి ఒక దేశం లో ధార్మిక సంస్థ లు మరియు ఆధ్యాత్మిక సంస్థ లు సమాజ సంక్షేమం లో సదా కేంద్ర స్థానం లో నిలచాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం అమృత కాలం లో మనం అభివృద్ధి కి వేగాన్ని జత చేస్తున్నప్పుడు సత్య సాయి ట్రస్టు వంటి సంస్థ లు దీని లో ఒక ప్రముఖ పాత్ర ను పోషించవలసి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.
బాల వికాస్ వంటి కార్యక్రమాల ద్వారా క్రొత్త తరం లో సాంస్కృతిక భారతదేశాన్ని సత్య సాయి ట్రస్టు యొక్క ఆధ్యాత్మిక విభాగం తయారు చేస్తున్నందుకు హర్షాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. దేశం నిర్మాణం లోను, సమాజం సశక్తీకరణ లోను సత్య సాయి ట్రస్టు యొక్క ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ప్రశాంతి నిలయం లోని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం తో కూడినటువంటి ఆసుపత్రి ని గురించి, అలాగే కొన్నేళ్ళుగా ఉచితం గా విద్య ను బోధిస్తున్నటువంటి పాఠశాలల ను మరియు కళాశాలల ను గురించి కూడా ప్రస్తావించారు. సత్య సాయి తో అనుబంధం కలిగినటువంటి సంస్థ లు అంకిత భావం తో పాటుపడుతూ ఉన్న సంగతి ని గురించి సైతం ఆయన వివరించారు. ‘జల్ జీవన్ మిశన్’ లో భాగం గా ప్రతి ఒక్క గ్రామాన్ని స్వచ్ఛమైన నీటి సరఫరా సదుపాయం తో జోడించడం జరుగుతోంది, మరి మారుమూల గ్రామాల కు ఉచితం గా నీటి ని అందించే మానవీయ కృషి లో సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఒక భాగస్వామి అయింది అని ఆయన అన్నారు.
భారతదేశం తీసుకొన్న మిశన్ లైఫ్ వంటి శీతోష్ణస్థితి సంబంధి కార్యక్రమాల ను మరియు ప్రతిష్టాత్మకమైనటువంటి జి-20 అధ్యక్షత ను ప్రపంచం గుర్తించిన సంగతి ని ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ తాలూకు ఇతివృత్తాన్ని గురించి ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. భారతదేశం పట్ల ప్రపంచం లో ఆసక్తి పెరుగుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఐరాస ప్రధాన కేంద్రం లో అనేక దేశాలకు చెందిన వారు పోగయి యోగ అభ్యాసం కార్యక్రమం లో పాలుపంచుకోవడం ద్వారా ప్రపంచ రికార్డు ను నెలకొల్పడాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. యోగ తో పాటుగా ఆయుర్వేద ను, దీర్ఘకాలం పాటు ఆచరించదగినటువంటి జీవన సరళి అభ్యాసాల ను భారతదేశం వద్ద నుండి ప్రజలు స్వీకరిస్తున్నారని కూడా ఆయన అన్నారు. చోరీ కి గురి అయిన కళాఖండాల ను ఇటీవల భారతదేశాని కి తిరిగి ఇచ్చివేస్తున్న సంగతి ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘ఈ ప్రయాసల కు వెనుక మన సాంస్కృతిక భావజాలం అనేది మన అతి పెద్ద బలం గా ఉంటున్నది. ఈ కారణం గా ఈ తరహా ప్రయాసల లో సత్య సాయి ట్రస్టు వంటి సాంస్కృతిక సంస్థ లు మరియు ఆధ్యాత్మిక సంస్థ లు ఒక పెద్ద పాత్ర ను పోషించవలసివుంది’’, అని ప్రధాన మంత్రి అన్నారు.
రాబోయే రెండు సంవత్సరాల లో కోటి మొక్కల ను నాటాలి అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ ను తీసుకొన్న ‘ప్రేమ్ తరు’ కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ఇటువంటి కార్యక్రమాల ను సమర్థించడానికి .. అది మొక్కలు నాటడం కావచ్చు లేదా భారతదేశాన్ని ప్లాస్టిక్ కు తావు ఉండనటువంటి దేశం గా మార్చాలి అనే సంకల్పం కావచ్చు.. ముందుకు రావలసింది గా ప్రతి ఒక్కరి కి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సౌర శక్తి మరియు స్వచ్ఛ శక్తి వంటి ఐచ్ఛికాల ద్వారా ప్రేరణ ను పొందాలి అని కూడా ప్రజల ను ఆయన కోరారు.
శ్రీ అన్న రాగి-జావ ను ఆంధ్ర లో సుమారు 40 లక్షల మంది విద్యార్థుల కు అందించేందుకు సత్య సాయి సెంట్రల్ ట్రస్టు తీసుకొన్న కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు. శ్రీ అన్న తాలూకు ఆరోగ్య సంబంధి ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ కోవ కు చెందిన కార్యక్రమాల తో ఇతర రాష్ట్రాలు జత పడితే దేశం భారీ ప్రయోజనాన్ని పొందగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శ్రీ అన్న వల్ల స్వస్థత సమకూరుతుంది, మరి దీని లో అనేక సంభావ్యత లు కూడా ఉన్నాయి. మన అందరి ప్రయాస లు ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల ను పెంపొందింప చేస్తాయి; భారతదేశం యొక్క గుర్తింపు ను బలపరుస్తాయి’’ అని కూడా ఆయన అన్నారు.
‘‘సత్య సాయి యొక్క దీవెన లు మనందరి కి ఉన్నాయి. ఈ శక్తి తో, మనం ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించి, మరి యావత్తు ప్రపంచాని కి సేవల ను అందించాలన్న మన సంకల్పాన్ని నెరవేర్చుకొందాం.’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్వరంగం
పుట్టపర్తి లో శ్రీ సత్య సాయి బాబా ప్రధాన ఆశ్రమమైన ప్రశాంతి నిలయం లో ‘సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటర్’ అనే కొత్త భవనాన్ని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు నిర్మించింది. ఈ భవన నిర్మాణాని కి వితరణశీలి శ్రీ ర్యూకో హిరా భూరి విరాళాన్ని అందించారు. సాంస్కృతిక ఆదాన ప్రదానాల ను, ఆధ్యాత్మికత్వాన్ని, ప్రపంచ సామరస్యాన్ని ప్రోత్సహించే దృక్పథం వంటి వాటి కి ప్రతీక గా ఈ కేంద్రం నిలుస్తుంది. విభిన్న నేపథ్యాలు ఉన్న ప్రపంచ ప్రజానీకం ఒకే చోటు లో చేరడం తో పాటు అనుబంధాన్ని కూడా పెంచుకోవడానికి, శ్రీ సత్య సాయి బాబా బోధన ల సారాన్ని అన్వేషించడానికి తగిన వాతావరణం ఈ కేంద్రం లో నెలకొంటుంది. వివిధ రకాల సమావేశాల, చర్చాగోష్ఠుల, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కు ఇక్కడి ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఎంతో సౌలభ్యం కల్పిస్తాయి. అన్ని వర్గాలు, వ్యక్తుల మధ్య పరస్పర సంభాషణ, అవగాహనల ను పెంపొందించడం లో ఈ కేంద్రం కీలక భూమిక ను వహిస్తుంది. ఈ సువిశాల ప్రాంగణం లో ధ్యాన మందిరాలు, ఆహ్లాదకర ఉద్యానాలు, వసతి సౌకర్యాలు సైతం అందుబాటు లో ఉన్నాయి.