విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, రీజనల్ ఆఫీస్, విజయవాడ వారు తన యొక్క సెక్రటరీ, గణాంక మరియు కార్యక్రమాల అమలు మరియు మంత్రిత్వ శాఖ ఆదేశములు మేరకు స్వచ్ఛతా పక్వాడ 2023 కార్యక్రమం మంగళవారం సిపిడబ్ల్యుడి కాన్ఫరెన్స్ హాల్, సిజిఓ కాంప్లెక్స్, ఆటోనగర్, విజయవాడ నందు సిబ్బందికి స్వచ్ఛతా అవగాహన కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, రీజనల్ ఆఫీస్, విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఆర్.కిరణ్ కుమార్, ఐఎస్‌ఎస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంను ఎం.శామ్యూల్, అసిస్టెంట్ డైరెక్టర్ & హెచ్‌ఓ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (ఎఫ్‌ఓడి) ప్రారంభిస్తూ ఈ కార్యక్రమమునకు విచ్చేసిన గౌరవ అతిధుల గురించి సభలో పాల్గొన్న నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అధికారులకు మరియు సిబ్బందికి పరిచయ కార్యక్రమమును నిర్వహించారు. ముఖ్య అతిధులుగా వేంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్, సిపిడబ్ల్యుడి, ఎం.సోమేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ, డాక్టర్ జి.డి.58, జాయింట్ డైరెక్టర్ పిఐబి, విజయవాడ, పి.రత్నాకర్, జాయింట్ డైరెక్టర్, సిబిసి, విజయవాడలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంనకు అధ్యక్షత వహించిన ఆర్.కిరణ్‌కుమార్, 155 డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, రీజనల్ ఆఫీస్, విజయవాడ వారు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పరిశ్రుభ్రత మరియు పారిశుధ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ క్లీన్ ఇండియా గురించి మాట్లాడారు. సభలో పాల్గొన్న అతిధులు కూడ స్వచ్ఛతా పక్వాడ గురించి మాట్లడటం జరిగింది. అతిధులను జ్ఞాపికలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు మరియు సిబ్బంది స్వచ్ఛతను పాటిస్తామని ‘‘ప్రతిజ్ఞ’’ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆర్.కిరణ్ కుమార్, ఐఎస్‌ఎస్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రజలకు స్వచ్ఛతా కార్యక్రమము గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ఆటోనగర్, బందర్‌రోడ్డు మీదుగా బ్యానర్‌తో ప్లకార్డ్స్ ప్రదర్శన నిర్వహించారు.
Tags vijayawada
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …