Breaking News

పేదవాడి మనసెరిగిన నాయకుడు సీఎం వైఎస్ జగన్

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-59 వ డివిజన్ 244 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతిఒక్క పేదవాడి మనసెరిగి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59 వ డివిజన్ 244 వ వార్డు సచివాలయ పరిధి అజిత్ సింగ్ నగర్లో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. 213 గడపలను సందర్శించి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజల ముందుకు వచ్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి గడప గడపకు మన ప్రభుత్వం ఎంతగానో దోహదపడుతోందన్నారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గ్రీవెన్స్ స్వీకరించారు. కూలిన సైడ్ డ్రెయిన్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా అధికారులకు సూచించారు. అలాగే అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సచివాలయ పరిధిలో రూ. 7.61 కోట్ల సంక్షేమం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ పరిధిలో అక్షరాలా 7 కోట్ల 61 లక్షల 46 వేల 962 రూపాయల సంక్షేమాన్ని పేదలకు అందజేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతినెలా 370 మందికి క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 415 మందికి రూ. 53.95 లక్షలు., చేయూత ద్వారా 218 మందికి రూ. 40.87 లక్షలు., కాపు నేస్తం ద్వారా 8 మందికి రూ.1.20 లక్షలు., జగనన్న తోడు ద్వారా 52 మందికి రూ. 5.20 లక్షలు., చేదోడు ద్వారా 24 మందికి రూ. 2.40 లక్షలు., వాహనమిత్ర ద్వారా 28 మందికి రూ. 2.80 లక్షల ఆర్థిక సాయాన్ని ఒక్క ఏడాదిలోనే అందించినట్లు వివరించారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ 1,235 మందికి సచివాలయ పరిధిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

ఉనికి కోసం ప్రతిపక్షాల పాట్లు
రాష్ట్రంలో ఉనికి కోసం ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నాయని మల్లాది విష్ణు విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఐదేళ్లు అధికారాన్ని పంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో చిట్టచివరిన నిలిపారని మండిపడ్డారు. విభజనకు సంబంధించి కేంద్ర నిధులు రాబట్టడంలోనూ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రణాళికబద్ధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ.. ప్రజలకు గుడ్ గవర్నెన్స్ ను అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నడిపారని మల్లాది విష్ణు అన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడి ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తూ.. పాలనలో పారదర్శకత తీసుకువచ్చారన్నారు. గత చంద్రబాబు అవినీతి పాలనకు, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు.

బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత సీఎం జగన్ ది
బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత నారా లోకేష్ కి, తెలుగుదేశం నాయకులకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. గతంలో 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని విమర్శించారు. అదే సీఎం వైఎస్ జగన్ 55 మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించి, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లగా, మున్సిపల్ చెర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో చెప్పిన దానికంటే మించి సామాజిక న్యాయం అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మల్లాది విష్ణు తెలిపారు. టీడీపీ హయాంలో బీసీలకు అవమానాలు ఎదురవ్వగా.. వైఎస్ జగన్‌ ప్రభుత్వంలో ఆత్మగౌరవం పెరిగిందన్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా గూర్చి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మల్లాది విష్ణు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం సోషల్ మీడియా విభాగం విలువలను దిగజారుస్తూ.. రాజకీయాలను కలుషితం చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి సమయంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు., ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా, నందెపు సురేష్, కంభగళ్ల రాజు, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, నేరెళ్ల శివ, నాయక్, శాంతకుమారి, పి.లక్ష్మి, జిలాని, దినేష్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *