Breaking News

ఇమునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

-జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం – పోస్టర్ విడుదల
-ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఇమ్మ్యునైజేషన్ కార్యక్రమం
-కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్లిష్ట పరిస్థితుల్లో, రవాణా సౌకర్యం లేని ప్రాంతాలో సైతం మనం ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు టీకాలు వేస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీత పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 ప్రత్యేక ఇమునైజషన్ కార్యాక్రమం పోస్టర్ ను జాయింట్ కలెక్టర్ తేజభరత్ తో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగంగా లక్ష్యాలను సాధించేందుకు జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాశాల్లో నెలలో వారం రోజులు పాటు నిర్వహించే ప్రత్యేక ఇమునైజేషన్ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చెయ్యాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి విడత ఆగస్టు 6 నుంచి 12వరకు, రెండవ విడత సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు, మూడో విడత అక్టోబర్ 9 నుంచి 14 వరకు ప్రత్యేక ఇమునైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు ఈ ప్రత్యేక ఇమ్మునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే క్రమం తప్పకుండా ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోను, సచివాలయాల్లోను ప్రతి బుధవారం, శనివారం టీకా (ఇమునైజేషన్) కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాటికి అనుసంధానంగా జిల్లాలోని ఏ ఒక్కరూ మిగలకుండా అందరికీ టీకాలు వేయడం ముఖ్యం అన్నారు. ప్రతి ఒక్కరికీ వివిధ వ్యాధులు నిర్మూలనకు అవసరమయ్యే టీకాలను అందించేందుకు ప్రత్యేక టీకా కార్యక్రమాలను పైన తెలిపిన తేదీల్లో ప్రతి గ్రామ, పట్టణ కేంద్రాల్లోని పిహెచ్ సీలు, సచివాలయాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంకా టీకాలో వేయించుకోని 0-5 పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించాల్సిన బాధ్యత తల్లితండ్రుల పై ఉందని, క్షేత్ర స్థాయి లో సిబ్బందికి సహకారం అందచేయాలని కోరారు. ఆమేరకు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పని సరిగా వైద్యులు, వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

జిల్లా ఇమునైజేషన్ అధికారి డా. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోని గర్భణీ స్త్రీలు -28 మంది, 0-2 సంవత్సరముల వయస్సు పిల్లలు-94 మంది, 2-5 సంవత్సరముల చిన్నారులు -83 మందిని గుర్తించామని వీరిందరికీ ఈ ప్రత్యేక టీకా కార్యక్రమం ద్వారా అందిస్తామని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి. నరశింహులు, డిఎం.హెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు, డి.ఐ.ఓ. డా. రాజకుమారి, డీసీహెచ్ ఓ డా. ఎన్. సనత్ కుమారి, డీపీహెచ్ ఎం వసంతలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *