-జిల్లా స్థాయి జూనోసెస్ మొదటి సమావేశంలో…
-కలెక్టరు డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జంతువుల నుండి మనుషులకి వ్యాధులు సంక్రమించకుండా తక్షణ వైద్య సేవలు అందచేసే ప్రక్రియలో ముందస్తు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన మొట్ట మొదటి జిల్లా స్థాయి జూనోసెస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జి. నరశింహులు, వైద్య ఆరోగ్య, జిల్లా పశు సంవర్థక అధికారి డా సత్య గోవింద్, డియంహెచ్ఓ డా. వెంకటేశ్వరరావు ఇతర కమిటీ సబ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ పర్యావరణం లో భాగంగా మనతో పాటు జీవించే జంతువులు (కుక్క, గేదేలు, కోళ్లు తో పాటు ఇతర జంతువులు) నుంచి వ్యాధులు ప్రభలకుండా వాటికి తరచు టీకాలు, వ్యాక్సినేషన్ వేయించాలన్నారు. బాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు మరియు పరాన్నజీవులు మానవులకు జూనోటిక్ వ్యాధులను తీసుకువెళతా యన్నారు. కోవిడ్ – 19 జూనోటిక్ వ్యాధికి ఒక ఉదాహరణ గా పేర్కనవచ్చునని, ఎందుకంటే COVID-19 యొక్క కారక ఏజెంట్ గబ్బిలాల నుండి ఉద్భవించినట్లు పరిగణించబడుతుందన్నారు. పెంపుడు కుక్కలకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా టీకాలు వేయించాలన్నారు. వాటితో స్నేహంగా ఉండే చిన్నారులు వ్యాధులు సంక్రమించకుండా తరచు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. పెంపుడు జంతువులుకు దగ్గరగా ఉండే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు.
జనసమూహం గల ప్రాంతాల్లోను పాఠశాలల యందు కుక్కలు సమూహం లేకుండా పంచాయితీరాజ్, పురపాలక, నగరపాలక సంస్థలు, పశుసంవర్థక శాఖల అధికారులు సమన్వయంతో నియంత్రించే చర్యలు చేపట్టి జనసమూహం లేని ప్రాంతాల్లో విడిచి పెట్టాలనన్నారు. అవసరం మేరకు పశువైద్యాధికారులు కుక్కలకు గర్భనిరోదిక మాత్రలు, కుటుంబ నియంత్రణ వంటి ఆపరేషన్స్ చేయాలని సూచించారు. భుజం పైభాగం తల క్రింది బాగంలో కుక్క కరచిన, లోతుగా కరచిన రాబీస్ వ్యాక్సిన్తో తోపాటు ఇమ్యునోగ్లోబులిన్స్ (Immunoglobulin) వ్యాక్సన్ వేయించుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలల విద్యార్థులకు రాబీస్ వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి మెడికల్ షాపుల నందు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు సంబంధించిన రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు ఇతర జంతువులు బారిన పడిన వారికి అందచేయాల్సిన వ్యాక్సిన్లను అందుబాటులో ఉండే విధంగా కమిటీ చర్యలు చేపట్టాలని సూచించారు. జూనోటిక్ వ్యాధులు నీరు, ఆహారం మరియు పర్యావరణం ద్వారా మాత్రమే కాకుండా అడవి జంతువులు, పెంపుడు జంతువుల ద్వారా కూడా వ్యాపిస్తాయన్నారు. పెంపుడు జంతువులను తమ ఇంటిలో ఉంచుకునే వ్యక్తులు వాటి విషయంలో సరైన పరిశుభ్రత పరిస్థితులను పాటించాలని, వాటికి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, ఆమేరకు ప్రజల్లో అవగాహన కలుగ చెయ్యాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి. నరశింహులు, మెంబరు కన్వీనర్ డా. రాజీవ్ సామ్యూల్, డా. టిఎస్. రమేష్ చంద్ర, కమిటీ సభ్యులు డియంహెచ్ ఓ డా. కే. వెంకటేశ్వరరావు, జిల్లా పశు సంవర్థక అధికారి ఎస్టీజి సత్యగోవిందం, డా. డి. నాగమణి, డా. లక్ష్మీ సూర్య ప్రభ, డా. ఆర్. రమేష్, పశుసంవర్థకశాఖ డీడీ డా. కె. వెంకటరత్నం, ఏడి డా. కే.సత్యనారాయణ, డీసీహెచ్ఓ డా. ఎన్. సనత్ కుమారి,
తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News