Breaking News

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

-గ్రీన్ ఎర్త్ – గ్రీన్ ఆంధ్రా ద్వారా మొక్కలు నాటి వాటిని పరిరక్షిద్దాం
-ఐ ఏ ఎస్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
-25 వేల మొక్కల న పంపిణీ కార్యక్రమం
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
గ్రీన్ ఎర్త్ ….. గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 25 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడోతో పాటు వాటిని సంరక్షణ చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపు నిచ్చారు. నేడు కాంక్రీట్ జంగిల్ గా పట్టణాలు, గ్రామాలు రూపు దిద్దుకోవడం, వాహనాలు పెరగడం తో వాతావరణం విపరీతమైన కాలుష్యం బారిన పడడం చూస్తున్నామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలు నాటి వాటి పరిరక్షణ సామాజిక బాధ్యతగా చేపట్టి ఆహ్లాదకర వాతావరణంలో గల చక్కని గ్రీనరీని తీర్చిదిద్దుదామన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. వాతావరణ మార్పులు సవాళ్లు మరియు సహజ వనరుల పరిరక్షణ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇది ఒక ముఖ్యమైన సందర్భమని కలెక్టరు పేర్కొన్నారు.

ఈసందర్బంగా పర్యావరణ కాలుష్య నివారణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఐఏఎస్ ఆఫీసర్స్ సతీమణులు, మహిళా అధికారులు, మహిళా వాలంటీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సతీమణి ఎన్. శ్వేత, మునిసిపల్ కమిషనర్ సతీమణి కె. సౌమ్య లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సతీమణి ఎన్.శ్వేత, మునిసిపల్ కమిషనర్ సతీమణి కె.సౌమ్య, డ్వామా పిడి జీఎస్ రామ్ గోపాల్, మహిళా అధికారులు ఎస్. సుభాషిణి, కే ఎస్ జ్యోతి, కే.విజయ కుమారి, డా.ఎన్.వసుంధర, వి. శాంత మణి, పి. వీణాదేవి, టిడ్కో డిఈజీ.నాగేశ్వరీ, కలెక్టరేట్ ఇతర కార్యాలయాల మహిళా ఉద్యోగులు, సిబ్బంది,వాలంటీర్లు పాల్గొన్నారు..

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *