-లోతట్టు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలింపుకి చర్యలు తీసుకోవడం జరిగింది..
-అధికారులు, సిబ్బంది పూర్తి సన్నద్ధం చేశాం సన్నద్ధంగా ఉండాలి
-ఇప్పటి అన్ని ఘాట్స్ వద్ద బ్యారేకెట్లను ఏర్పాటు చేశాం
-ముఖ్యమంత్రి తో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ డా కె.. మాధవీలత వెల్లడి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తి అప్రమత్తం గా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు.
శుక్రవారం తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ తో పాటు జేసీ ఎన్.తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.
గోదావరి నది కి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్న దృష్ట్యా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశిస్తూ రాష్ట్రంలో అధిక వర్షాలు వరదలు కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత కుటుంబాలకు పారదర్శకంగా 25 కిలోల బియ్యం, మంచి నూనె, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులు ఉచితంగా అందజేయాలన్నారు. ఈ విషయంలో ఎన్యుమరేషన్ ప్రక్రియ ను పారదర్శకంగా చెయ్యాలని స్పష్టం చేశారు. జిల్లా, డివిజన్, మండల, సచివాలయం పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని సూచించారు. పునరావస కేంద్రాల వద్ద, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ, మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య చికిత్స, మందులు అందచేయాలని ఆదేశించారు. వరద ఉదృతి తగ్గిన తర్వాత వరద నష్టం పై ఎన్యుమరేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మాధవీలత వివరిస్తూ గోదావరినది కాటన్ బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ ప్రజలను అప్రమత్తం చేసామన్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, నియోజక వర్గ, మండల స్పెషల్ ఆఫీసర్స్ ను, అగ్నిమాపక, మత్స్య, పురపాలక, అగ్నిమాపక , పంచాయతీ రాజ్ తదితర శాఖలను అప్రమత్తం చేస్తూ ఆయా ప్రదేశాలు విధులు కేటాయించమన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు గోదావరి నది తీర ప్రాంతాల్లో విధులకు హాజరు అయ్యారని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు లంక గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. లంక గ్రామాల్లో ప్రజలు చేపల వృత్తిపై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్న దృష్ట్యా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.లంక గ్రామాల్లో ఉన్న పశువుల విషయంలో ఇప్పటికే హెచ్చరికలను జారీ చేశామన్నారు. వీటికి సంబంధించిన నిర్ధారణ చేసుకోవడం జరుగు తున్నట్లు వివరించారు. పరిస్థితి నైనా ఎదుర్కునేందుకు అన్ని శాఖలు సమన్వయం సిద్ధంగా ఉన్నామని కలెక్టరు వివరించారు. జిల్లా మరియు డివిజినల్ , మండల స్థాయి లో స్థాయి కంట్రోల్ రూమ్ 24/7 ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా కలెక్టరెట్,ఆర్డీవో రాజమహేంద్రవరం, ఆర్డీవో కొవ్వూరు కార్యాలయాలతో పాటు మండల కేంద్రాల్లో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు మరియు ప్రాణ, ఆస్థి, పంట, పశు సంపదలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి లో అధికారులు , సిబ్బంది వరద నీరు ప్రవహించే మార్గాల్లో గట్లు తెగే ప్రాంతాలను గుర్తించి అప్రమత్తమయ్యా మన్నారు. బలహీనంగా ఉండి గట్లు ఉన్న చోట్ల ముందస్తుగా ఇసుక బస్తాలు, ఇతర రక్షణ కల్పించే విధంగా ఆయా శాఖలు సమన్వయం తో సామాగ్రి ని సిద్దం చేసినట్లు కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు . పరిస్థితికి అనుగుణంగా పునరావాస కేంద్రాలు, వైద్య సహాయ శిబిరాలను సిద్దం చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలను సిద్దం చేసుకొని అవసరమైన ఆహార పదార్థాలు, మందులు, వైద్య శిబిరాలు, బోట్స్ సిద్దం చేసినట్లు కలెక్టర్ తెలియచేశారు.
జిల్లాలో రెండు లంక గ్రామాలకు సంబంధించి 12 మంది గర్భిణీలను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఐదుగురు బాలింతలను ఆరోగ్య కేంద్రాలకు తరలించమన్నారు. పునరావాసకేంద్రానికి చేరుకున్న కుటుంబానికి 2 వేలు రూపాయలు, ఒక్కరూ ఉంటే వెయ్యి రూపాయలు అందుస్తున్నా మన్నారు. అదేవిందంగా లంక గ్రామాలకు వలస వచ్చిన 56 మంది మత్య్సకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని కలెక్టరు వివరించారు. రాజమహేంద్రవరం లో ఆవ ప్ర్రాంతంలో గత ఏడాది వరదలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తగా వరద నీటిని తోడేందుకు మోటార్లు సిద్దం చేసామని వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్,పి. రజని, డిఆర్ఓ జీ.నరసింహులు, అడిషనల్ ఎస్పీ డిఎంహెచ్ ఓ డా. కే వెంకటేశ్వరరావు, డి ఏ వో ఎస్ మాధవరావు, డిహెచ్ఓ ఎస్ టి జి సత్య గోవిందం తదితరులు పాల్గొన్నారు.