Breaking News

జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటిన శ్రీమతుల సంఘం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఐ ఎ ఎస్ ల శ్రీమతుల సంఘం పిలుపు మేరకు మనం అందరం గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం అనే పిలుపు మేరకు ఉదయం జాతీయ రహదారి పేరూరు వద్ద జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణా రెడ్డి వారి శ్రీమతి కె. కల్యాణి మేడం, జేసి డి కే బాలాజీ వారి శ్రీమతి పృథ్వి కల్యాణి మేడం కలసి భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపు నిచ్చారు. జాతీయ రోడ్డు ప్రాజెక్టులో నరికివేయబడిన ప్రతి చెట్టుకు రెట్టింపు సంఖ్యలో చెట్లను నాటడం ద్వారా పరిహారంగా పూర్తిగా పెరిగిన మరియు పెద్ద సైజు చెట్లు విజయవంతంగా నాటడం జరుగుతున్నదని, ఈ నెల 12 న ఈ జిల్లా నుండే రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ పిడి వెంకటేశ్వర్లు, అధికారులు వున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *