-ప్రజల ఆర్జీలను పరిష్కరించి 3,72,886 సర్టిఫికేట్లు అందించాం..
-జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్‌కుమార్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని ప్రజల ఆర్జీలను పరిష్కరించి 3 లక్షల 72 వేల 886 సర్టిఫికేట్లను జారి చేసిన్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ తెలిపారు.జగనన్న సురక్ష కార్యక్రమం అమలు పై మంగళవారం జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ నగరంలోని ఆయన కార్యాలయం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు అవసరమైన వివిధ సర్టిఫికేట్లను తక్షణమే మంజూరు చేయడం జరిగిందన్నారు. గతంలో ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్ల కొరకు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగవలసి వచ్చేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాలు ద్వారా సాధ్యమైనంత త్వరగా గడువులోపు సర్టిఫికేట్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అయినప్పటికి ప్రజలకు మరింత మెరుగైన ప్రభుత్వ సేవలు తక్షణమే అందించాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న సురక్ష వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో 16 మండలాలు, 5 మున్సిపాలీటిలలో 605 గ్రామ వార్డు సచివాలయల పరిధిలో జగనన్న సురక్ష సేవలు అందజేసిన్నట్లు ఆయన తెలిపారు. 10,669 మంది వాలంటీర్లు జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజలకు సేవలందించారన్నారు. 7 లక్షల 23 వేల 354 కుటుంబాలకు గాను 6 లక్షల 79 వేల 538 కుటుంబాలకు సంబంధించి సర్వే పూర్తి అయిందన్నారు. వలస వెళ్లిన, మరణించిన, ఆసక్తి చూపని వివిధ కారణాల వలన మిగిలిన 43,816 కుటుంబాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయవలసి ఉందన్నారు. ప్రజల నుండి 3 లక్షల 94 వేల 415 ధరఖాస్తులు స్వీకరించగా వాటిలో 3లక్షల 72 వేల 886 ఆర్జీలకు సంబంధించిన సర్టిఫికేట్లను జారీ చేయడం జరిగిందన్నారు. ఇందులో 1,61,159 ఇంటిగ్రేడెట్ సర్టిఫికేట్లు, 1,38,808 ఇన్‌కమ్ సర్టిఫికేట్లు కాగా మరో 72,919 సర్టిఫికేట్లకు సంబంధించి ఆర్‌వోఆర్ 1బి, రీఎస్యూరెన్స్ ఇంటిగ్రేటెడ్, కంప్యూటరైజడ్ అడంగల్, రీఎస్యూరెన్స్ ఆదాయ సర్టిఫికేట్లు, ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం, ఆధార్‌కు చిరునామ మార్పు, న్యూ రైస్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఓబిసి సర్టిఫికేట్, ఎన్‌కంబరెన్స్, జనన మరణ దృవీకరణ సర్టిఫికేట్లు, ఇన్‌కమ్ సర్టిఫికేట్లు వంటి సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగిందన్నారు. మిగిలిన సుమారు 13 వేల ఆర్జీలు పరిష్కరించేందుకు గడువు ఉందని, గడువులోగా పూర్తి స్థాయిలో ఆర్జీలను పరిష్కరించి అవసరమైన సర్టిఫికేట్లను జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణలో రాష్ట్రంలోనే జిల్లా నాలుగవ స్థానంలో నిలిచిందన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో మాత్రమే ప్రజలు వారి పిల్లలకు కావాల్సిన దృవీకరణ పత్రాలు గుర్తుకు వచ్చేవని దృవీకరణ పత్రాల కొరకు దరఖాస్తు చేసుకుని సకాలంలో పొందలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. జగనన్న సురక్ష ద్వారా అవసరమైన సర్టిఫికేట్లను ఒక రూపాయి కూడా రుసుము తీసుకోకుండా వసూలు చేయకుండా ఉచితంగా సర్టిఫికేట్లను ప్రజల గడప వద్దకే వెళ్లి అందజేయడం వలన విద్యా సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలు, కళాశాలలో ప్రవేశం పొందగలుగుతున్నామని ప్రజల నుండి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు నినాదంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిని సందర్శంచి, ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాలనే ఆలోచనతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ప్రజాప్రతినిధులు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నట్లు జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్ అన్నారు.
Prajavartha Online Telugu News