గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరునగర పాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికల్లో 7 మంది నామినేషన్లు వేశారని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీకి ఆగస్ట్ 11 న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మంగళవారం నామినేషన్ గడువు సమయానికి 7 మంది నామినేషన్లు వేశారని, బుధవారం నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించి, అర్హత కల్గిన వారి లిస్టును అదేరోజు పబ్లిష్ చేస్తామని తెలిపారు. ఆగస్ట్ 7 వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవడానికి గడువు ఉందని, అదే రోజు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్ట్ 11 న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, అదే రోజు 3 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్టాండింగ్ కమిటికి శ్యామల వెంకట రమణాదేవి(26), అడకా పద్మావతి (24), మల్లిబోయిన శ్రీవల్లి (51), సంకూరి శ్రీనివాసరావు (13), పాపతోటి అంబేద్కర్ (54), కండ్రగుంట గురవయ్య (21), షేక్ మహమూద్ (4)లు నామినేషన్లు వేశారు.
Prajavartha Online Telugu News