Tag Archives: gunter

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ​ ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …

Read More »

ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 5 రోజులే గడువు ఉందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక.. : కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 23వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

అధిక సంఖ్యలో మేళాను సందర్శిస్తున్న ప్రజలు

-నాచురల్ ఫార్మింగ్, బ్యాంబో మరియు అగ్రి మార్కెటింగ్ పై శిక్షణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మినీ భారత్ గా భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాల ప్రతీకగా దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలకు నిర్వహిస్తున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ ను శుక్రవారం కనుమ పర్వదినం రోజు అత్యధిక సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఉదయం నుంచే ప్రజల రద్దీ కొనసాగింది సాయంత్రం సమయంలో ఇది మరింత ఎక్కువైంది. ప్రజలు అత్యధిక సంఖ్యలో వస్తుండటంతో జిల్లా కలెక్టర్ …

Read More »

“వేసవి విజ్ఞాన శిఖరాలు”పోస్టర్ ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడు “వేసవి విజ్ఞాన శిఖరాలు”పోస్టర్లు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో ది:28/04/2025 నుండి 06/06/2025 వరకు 40 రోజు లు పాటు వేసవి విజ్ఞాన శిఖరాలు నిర్వహించబడును.ఈ వేసవి విజ్ఞాన శిఖరాలు ఉదయం :8:00 గంటలకు నుండి 11:00 గంటల వరకు నిర్వహించబడును. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను పంపి …

Read More »

జిఎంసి ఇంచార్జి మేయర్ గా భాధ్యతలు తీసుకున్న షేక్ సజిలా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కావటి శివనాగ మనోహర్ నాయుడు ఈ నెల 15న రాజీనామా చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ మేయర్ షేక్ సజిలాను నూతన మేయర్ ఎన్నిక జరిగే వరకు ఇంచార్జి మేయర్ గా భాద్యతలు తీసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ జరిగింది. సదరు ఉత్తర్వుల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కార్యాలయంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎంఎల్ఏలు నసీర్ అహ్మద్, గల్లా …

Read More »

గ్రామాలలో రీసర్వే

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సంయుక్త కలెక్టరు A భార్గవ్ తేజ, I.A.S., రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో ఈరోజు జరుగుచ్చన్న రీసర్వే గ్రామాలలో రీసర్వే ఏ విదముగా చేయుచున్నారో అని తనిఖీ చేయు నిమిత్తం ఈ రోజు ఆకస్మికముగా కాకుమాను మండలమునందు పాండ్రపాడు మరియు చేబ్రోలు మండలము నందు మంచాల గ్రామాలనందు జరుగుచున్న రీ సర్వే కార్యక్రమమును తనిఖీ చేసి యున్నారు. తదుపరి రీ సర్వే కార్యక్రమమునకు హాజరైన రైతులతో మాట్లాడి రీ సర్వే జరుగు విధానం మరియు …

Read More »

గడప గడపకు మన ప్రభుత్వం (జిజిఎంపి)పనులను పనులను వేగంగా చేపట్టాలని

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త: గడప గడపకు మన ప్రభుత్వం (జిజిఎంపి)పనులను పనులను వేగంగా చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జిజిఎంపి పనులను నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేయాలని, రోజువారి పనుల పురోగతి పై నివేదిక ఇవ్వాలన్నారు. పనులు పూర్తి అయిన వాటికి బిల్స్ అప్ లోడ్ …

Read More »

లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రైవేట్ వెంచర్లు లేదా లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే పట్టణ ప్రణాళిక అధికారులు తొలగింపు చర్యలు తీసుకుంటారని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ కాకాని రోడ్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్, నందివెలుగు రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన అపార్ట్మెంట్ లను తనిఖీ చేసి తదుపరి అనుమతులపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ …

Read More »

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 7 మంది నామినేషన్లు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరునగర పాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికల్లో 7 మంది నామినేషన్లు వేశారని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీకి ఆగస్ట్ 11 న ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మంగళవారం నామినేషన్ గడువు సమయానికి 7 మంది నామినేషన్లు వేశారని, బుధవారం నామినేషన్ల స్క్రూట్నీ నిర్వహించి, అర్హత కల్గిన వారి లిస్టును అదేరోజు పబ్లిష్ చేస్తామని తెలిపారు. ఆగస్ట్ 7 …

Read More »