గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 5 రోజులే గడువు ఉందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. గురువారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,51,246 ఫారాలను (99.68 శాతం) పంపిణీ చేసి, అందులో 1,58,911 ఫారాలను డిజిటైజ్డ్ చేశామని వివరించారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,77,052 ఫారాలను (99.46 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 1,63,809 ఫారాల డిజిటైజ్డ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News