Breaking News

సోమ, మంగళ రాజమహేంద్రవరం లో సీఎం

-ముందస్తు భద్రత ఏర్పాట్ల పరిశీలన
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 7 వ తేదీ రాజమహేంద్రవరం వొచ్చుచున్న నేపథ్యం లో సమన్వయ శాఖలతో ముందస్తు భద్రత, తదితర అంశాలపై క్షేత్ర స్థాయి లో సమీక్ష నిర్వహించామని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు.

ఆదివారం సాయంత్రం ప్రస్తుత ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, నూతనంగా జిల్లా ఇంఛార్జి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్. సతీష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె
మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 7 సోమవారం సాయంత్రం 4.10 నిముషాలకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని, అక్కడ నుంచి ఆర్ అండ్ బి అతిధి గృహానికి మ.4 20 కు చేరుకుని సా.4.30 నుంచి సమీక్షా సమావేశంలో పాల్గొని, రాత్రి బస చేస్తారని తెలిపారు.
ఆగస్ట్ 8 మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి బయలుదేరి ఉ.9 10 కి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుని, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వెళతారని పేర్కొన్నారు.

సిఎం పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముగిసే వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ ను తూ ఛ తప్పకుండా అమలు చెయ్యాలని ఆదేశించారు. బదిలీ అయిన ఎస్పీ సుధీర్ కుమార్, ఇంఛార్జి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ లు పోలీసు భద్రత చర్యలు, రూట్ మ్యాప్, బందోబస్తు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. రెవెన్యూ, డివిజన్ ఆర్ అండ్ బి, విద్యుత్, మెడికల్, మునిసిపల్, పంచాయతీ, ఫుడ్ ఇన్స్పెక్టర్, అగ్నిమాపక, సమాచార తదితర శాఖల అధికారులకు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య, పోలీస్, ఫైర్, మునిసిపల్ శాఖల అధికారులు షిఫ్ట్ ల వారీగా అధికారులకు , సిబ్బందికి డ్యూటీలు వెయ్యాలని ఆదేశించారు. అంబులెన్స్, వైద్యులను అందుబాటు లో ఉంచాలన్నారు.

ఈ సందర్శనకు కలెక్టర్ వెంట ప్రస్తుత ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, నూతనంగా  జిల్లా ఇంఛార్జి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్. సతీష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్  , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,  సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, సిఎం సెక్యూరిటీ అధికారి ప్రసాద్, ఆర్డీవోలు ఏ. చైత్ర వర్షిణి, ఎస్. మల్లిబాబు , జిల్లా అధికారులు వి. స్వామి నాయుడు, ఎస్బికే రెడ్డి, జేవి సత్యనారాయణ, డా కె. వేంకటేశ్వర రావు, మధుసూధన్, వి. వినూత్న, మార్టిన్ కింగ్, నగరపాలక సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *