అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గం. ల సమయంలో అనపర్తి రామాలయం ఎదురుగా బాపనమ్మ గుడి వద్ద అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లశం తో స్థానిక గ్రామ సర్పంచ్ కుమారి, మాజీ జడ్ పిటిసి దొరబాబు లు ఆ మగ శిశువును అనపర్తి ఏరియా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందని ఏరియా ఆసుపత్రుల జిల్లా కోఆర్డినేటర్ డా ఎన్. సనత్ కుమారీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిశువుని ఆసుపత్రి కి తీసుకు వచ్చిన వెంటనే పరీక్షించిన తర్వాత హాస్పిటల్ లో అడ్మిట్ చేసి , ట్రీట్మెంట్ అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యం బాగుందన్నారు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీస్, ఐసిడిఎస్ అందించామన్నారు. ప్రస్తుతం బేబీ ఆరోగ్యం బాగుందని ఏరియా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారని వారు తెలిపారు. ఆ మగ శిశువుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Prajavartha Online Telugu News