రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఎం . టి. కృష్ణబాబు రాజమహేంద్రవరం లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పరిశీలించారు. వాటి యొక్క పనులు , నాణ్యత తో కూడి పూర్తి చేయడానికి సూచనలు చేయ్యాడం జరిగింది. ఈ పర్యటన లో భాగంగా ప్రతి రూము నందు పరిశీలించి కరెంటు ఇతర సదుపాయాలు ఏ విధంగా ఉన్నవి అని అడిగి తెలుసు కున్నారు. అందుకు అనుగుణంగా చేపట్ట వలసిన చర్యలు పై అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పర్యటనలో క్లాస్ రూమ్ లు, ల్యాబ్, ఆఫీసు రూములు నిర్మాణ పనులు పరిశీలించి ఎక్కడ పెండింగ్ పనులు ఉన్నాయో తెలుసుకొని, ఇంకా జరగవలసినవి వాటిని వెంటనే పూర్తి చేయాలని తెలియపరిచారు.
సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తారని, ఆరోజు నాటికి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు జరగాలని ఆదేశించారు. అడ్మిషన్ జరుగు తున్నందున అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని పేరెంట్స్ యొక్క అభిప్రాయాలను సూచనలు తెలుసుకుని, మౌలిక సదుపాయాలు విషయంలో కృష్ణ బాబు భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆసుపత్రి కి చెందిన ప్రతి డిపార్ట్మెంట్ హెచ్వోడీలతో సమావేశపరిచి వారు సూచనల పరిగణన లోనికి తీసుకుని ఆమేరకు చర్యలకు తీసుకుంటా మని తెలిపారు. భోధన సిబ్బందికి, విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణ పనులు చేపట్టాలని తెలియజేశారు . ఈ సందర్భంలో ఏఎన్ఎంలు యాప్ లతో ఇబ్బందులు, అధిక భారం అవుతోందని , తగ్గించాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ఏం.టి.కృష్ణబాబు గారిని కోరటం జరిగింది . పనివారాన్ని తగ్గించే విధంగా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వీరి వెంట కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి సౌభాగ్య లక్ష్మి , జిజిహెచ్ సూపరింటండెంట్ డా. టీవీ సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఇతర వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.