Breaking News

జిల్లాలో 91.24 శాతం డోర్ టూ డోర్ సర్వే పూర్తి చేశాం

-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఓటర్ల గుర్తింపు డోర్ టూ డోర్ సర్వే నిర్వహించడం జరుగుతోందని , సంభందిత ఎలెక్టోరల్ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత కలిగి ఉండాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత తెలియ చేశారు.

శుక్రవారం సాయంత్రం సుదీర్ఘంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెలగపూడి నుంచి జిల్లాల వారీగా ఎస్ ఎస్ ఆర్ 2024 పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టిన డోర్ టూ డోర్ ఓటర్ల గుర్తింపు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు లకు చెంది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మార్గ దర్శకాలు పాటించాలని ఆదేశించడం జరిగిందన్నారు. చిరునామా మార్పు కి చెంది ఫారం – 8 ద్వారా డిజిటలైజేషన్ చేపట్టాలని బి ఎల్ వో లకు తెలియ చేసినట్లు తెలిపారు. ఎలెక్టోరల్ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఎటువంటి తప్పులు లేకుండా చూడడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 5,86,861 గృహాలకు గాను 4,18,438 గృహాలు బి ఎల్ వో యాప్ ద్వారా, భౌతికంగా 1,17,033 గృహాలను డోర్ టూ డోర్ సర్వే 91.24% పూర్తి చేసినట్లు మాధవీలత తెలిపారు. ఈనెల 21 తో ఇంటింటి కి తిరిగి ఓటరు గుర్తింపు ప్రక్రియ పూర్తి చెయ్యవలసి ఉన్న దృష్ట్యా ఆమేరకు క్షేత్ర స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. కొత్తగా 6,888 మంది ఓటర్ల ను సర్వే సందర్భంగా గుర్తించి నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 7111 డూప్లికేట్ ఓటర్ల ను 0ఇంటి చిరునామా మారిన 5,013 మంది, మరణించిన 13,332 మంది ఓటర్ల ను గుర్తించామని మాధవీలత తెలిపారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, డిఆర్వో జీ.నరసింహులు, నియోజక వర్గ ఎన్నికల అధికారులు అనపర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్ (ఐ) లిమిటెడ్) ఏబీవీఎస్బి శ్రీనివాస్,  కొవ్వూరు (ఎస్ సి) కి కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లి బాబు, ,  రాజమండ్రి రూరల్ స్పెషల్ కలెక్టర్ ఎస్. సరళా వందనం, నిడదవోలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు కే. గీతాంజలి, గోపాలపురం (ఎస్ సి)స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఎల్ ఏ) ఓఎన్జిసి, రాజమహేంద్రవరం టిఇఎం రాజు,   కలెక్టరేట్ సెక్షన్ సిబ్బంది    తదితరులు  హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *