విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెంగళూరులో సెప్టెంబరు 25 నుంచి 30 వరకు జరిగిన 32వ నేషనల్ టెన్‌పిన్ బౌలింగ్ ఛాంపియన్షిప్ (టి.బి.ఎస్.ఐ)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక మహిళ సహా 8మంది క్రీడాకారులు పాల్గొన్న విషయం విధితమే. కాగా.. వారిలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సుమతీ నల్లబంటు టెన్‌పిన్ బౌలింగ్‌లో నాకౌట్ గేమ్‌లో 25 పిన్స్ తేడాతో రన్నరప్‌గా రెండొవ స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో కర్ణాటకకు చెందిన కిషన్.ఆర్. విజేతగా నిలవగా, ఆకాష్ అశోక్‌కుమార్ రన్నరప్‌గా నిలిచారు. అలాగే తమిళనాడుకు చెందిన సబీనా అత్తిక విన్నర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను కర్ణాటక క్రీడల శాఖ మంత్రి బి.నాగేంద్ర, కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.గోవిందరాజ్‌లు మెమొంటోలు అందజేసి అభినందించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …