-పిలాంత్రోపిక్ సొసైటీ మహాత్మా గాంధీ జాతీయ ప్రతిభా పురస్కారాల ప్రదానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతిపిత మహత్మా గాంధి సేవలు మానవాళికి అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజయోనా ఆధ్వర్యంలో విజయవాడలో సోమవారం హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు హాజరై ప్రసంగించారు .తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ సేవలు మరువరనివన్నారు . అనంతరం ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతులకు మహాత్మాగాంధీ నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డులను ప్రదానం చేశారు .ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయబాబు మాట్లాడుతూ తెలుగు భాష అభ్యున్నతికి భాషా వికాసానికి ఫిలాంత్రోఫిక్ సొసైటీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలకనుగుణంగా జగన్మోహన్ రెడ్డి పాలించడం అభినందనీయమన్నారు. ఏపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ పురస్కారాలు సామాజిక బాధ్యతను మరింత పెంచుతాయని సమాజ వికాసం కొరకు గ్రహీతలు కృషి చేయాలని కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన 20మందిని జ్ఞాపిక, ప్రసంసాపత్రానిచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. బాలగంగాధర్ తిలక్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు, డ్రీమ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్, ప్రముఖ సాహితీవేత్తలు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News