Breaking News

ఘనంగా మహాత్మా గాంధీ 154 వ జయంతి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో విద్యార్థులు పయనించి భావి భారతదేశాన్ని గాంధీ కలల రూపంగా రూపొందించాలంటూ 154 వ జయంతి సందర్భంగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన సభలో విద్యార్థులకు పిలుపునిచ్చారు మాజీ జస్టిస్ భవాని ప్రసాద్ తమ ప్రసంగంలో గాంధీ అనుసరించిన సత్యం అహింస అనుసరిస్తూ ప్రతి పనిలోనూ తమదైన ప్రత్యేకతను నిరూపించాలన్నారు. సామాన్యుడైన గాంధీ అసమాన్యుడుగా ఎదిగి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన తీరును తెలియజెప్పారు. గాంధీ నడిపిన ఉద్యమాలను వివరిస్తూ, ఆంధ్ర ప్రాంతం నుండి ఎందరో మహనీయులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని వారందరి గురించి తెలుసుకుని అనుసరించాలన్నారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారకనిది కార్యదర్శి వై రామచంద్ర రావు  అతిధులను ఆహ్వానించారు. రఘుపతి రాఘవ రాజారామ్ ప్రార్థన గీతం అనంతరం గాంధీ విగ్రహానికి అతిధులందరూ ఖద్దరు మాలలను వేసి నివాళులర్పించారు. వైస్ ప్రెసిడెంట్ చక్రపాణి తమ స్వాగ తోపన్యాసంలో గాంధీ శత జయంతి నాటికి తాము స్కూలు విద్యార్థినని అప్పటినుండి ఇప్పటివరకు గాంధీ పై ఎన్నో కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయంటే, అది మహాత్ముని గొప్పతనం అన్నారు. ఇంకా వందేళ్లయినా గాంధీని ప్రపంచం మరిచిపోదని, అంతటి గొప్ప నాయకులు గాంధీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ గాంధీ పిసి కాజా అతిధులందరినీ ఆహ్వానిస్తూ గాంధీ జీవితంలోని ప్రధాన సంఘటనలను తెలియచెప్పారు. ముఖ్యంగా సత్యం గురించి తెలుసుకోవాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్యాన్ని విడిచిపెట్టకూడదన్నారు. గాంధీని ప్రపంచ నాయకునిగా చేయడానికి ప్రధాన కారణం ఆయన చెప్పింది చేశారు, చేసింది చెప్పారు. భావిభారత పౌరులైన మీరందరూ గాంధీని ఆదర్శంగా తీసుకుని వారు కలలుగన్నరామరాజ్య స్థాపనకు కృషి చేయాలన్నారు.

మాజీ మేయర్ జంధ్యాల శంకర్ గాంధీ శత జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాలను ఐకాన్సుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో విజయవాడలో కేఎల్ రావు సారథ్యంలో గాంధీ హిల్ ఆరంభమైందని, దానికి సరిహద్దు గాంధీ ఖాన్అబ్దుల్ అబ్దుల్ గఫూర్ ఖాన్ విచ్చేసారని, అప్పట్లో గాంధీ పై సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని ప్రముఖ సినీ రంగ నటులు ఎన్టీ రామారావు, కొంగర జగ్గయ్య మొదలగువారు వ్యాఖ్యానంతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి  మద్యపాన నిషేధం వగైరాలపై ఆ రోజుల్లో నిబద్ధతతో జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావించి, మద్యంపై వచ్చే ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటం సోచనీయమన్నారు. మధ్యరహిత, మాదకద్రవ్య రహిత సమాజం ఏర్పడటమే గాంధీకి మనం ఇచ్చే నివాళి అన్నారు.

డాక్టర్ సమరం మాట్లాడుతూ గాంధీని చూడగలిగిన అదృష్టం తనకు దక్కిందని, ఏడేళ్ల వయసులో 15 రోజులపాటు మొత్తం కుటుంబం గాంధీ ఆశ్రమంలో గడిపిందన్నారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అని ఎదురు చూడక స్వయం ప్రతిపత్తితో ముందుకు సాగాలన్నారు. కులాలు, మతాలు, కుళ్ళు కుతంత్రాలు లేని సమ సమాజ స్థాపన గాంధీకి మనం ఇచ్చే నివాళి. గాంధీ ప్రజలందరినీ ఎంతగానో ప్రేమించేవారు అన్నారు.

మాజీ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్  మాట్లాడుతూ తాను గుజరాత్ లోని ఫోర్ బందర్ లో గాంధీ ఇంటిని సందర్శించినప్పుడు ఆనిర్వచనీయమైన అనుభూతికి లోనైనానన్నారు. గుడి గోపురాలకి లేదా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడమే కాక ఇలాంటి ప్రదేశాలకు వెళితే చక్కటి అనుభూతి కలుగుతుందని, అందరూ తప్పనిసరిగా దర్శించవలసిన ప్రదేశం అన్నారు.

ఉపన్యాసాల అనంతరం గాంధీ జన్మదిన సందర్భంగా వివిధ కాలేజీలు స్కూళ్లలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్, సింగింగ్, క్విజ్ పోటీలలోని విజేతలకు బహుమతులు అందించారు.

ఈ సంవత్సరం గాంధీ స్మారకనిదిపక్షాన పిల్లలలో చదివే అలవాటుతో పాటు గాంధీ గురించి తెలుసుకోవాలని ఉద్దేశంతో గాంధీ ప్రవేశిక అనే పరీక్షను నిర్వహించాలని ఆలోచించి, ఈ సంవత్సరం పైలెట్ ప్రాజెక్టుగా శ్రీ చిగురుపాటి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మోమెంటోలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహిస్తామని స్మారకనిది సభ్యులు తెలియజేశారు. సభకు డాక్టర్ రావి శారద సమన్వయకర్తగా వ్యవహరించగా, రశ్మి సమరం వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *