విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో నాయకులు అందరిని భాగస్వామ్యులను చేస్తూ వారికి కూడా మంచి పేరు వచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాల రూపకల్పన చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా క్రిష్ణలంక APSRM స్కూల్ ఆవరణలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ప్రజల ఆరోగ్యము మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపకల్పన చేయడం చరిత్రలో నిలిచిపోతుంది అని కొనియాడారు. ఏదైనా అనారోగ్యం వస్తే ఇంట్లో వాళ్లే హాస్పిటల్ తీసుకెళ్లడానికి బద్దకిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య సిబ్బందిని నేరుగా ఇంటికే పంపించి చేయి పట్టుకుని పరీక్షలు అన్ని చేసి అవసరమైన మందులు అందివ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తూ, మరోపక్క ప్రజల బాగోగులు చూస్తూ జగన్ గారు వారి చిత్తశుద్ధిని నిరూపించుకొన్నారని, ఏ నమ్మకంతో అయితే వారిని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకొన్నారని ఉద్ఘాటించారు. ప్రజలంతా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలని అవినాష్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా Dmho సుహాసిని,zc కృష్ణ,ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ సుబాని,డా సెల్ వైస్ ప్రెసిడెంట్ మెహబూబ్,వైసీపీ నాయకులు నిమ్మల జ్యోతిక,విజయలక్ష్మి,పళ్లెం రవి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …