విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విభజన తరువాత సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను తనకున్న అనుభవంతో గట్టెక్కిస్తారని నమ్మి ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చి చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేస్తే ఐదేళ్లలో అందినకాడికి దోచుకిని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘాటుగా విమర్శించారు. బుధవారం 6వ డివిజన్ పెదబావి సెంటర్ వద్ద 10లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు కు అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ రోడ్ అనేది ఇక్కడ ప్రజల చిరకాల కోరిక అని, గత టీడీపీ ప్రభుత్వం లో స్థానిక మహిళలు ఈ రోడ్ కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అప్పటి కార్పొరేటర్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగి మొరపెట్టుకొన్న పట్టించుకోలేదని అన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన గద్దె తన సొంత నిధులతో ఈ రోడ్ వేపిస్తా అని హామీ ఇచ్చి ఓట్లు వెపించుకొని గెలిచిన తరువాత మొహం చాటేశారని, వారి మనుషులు కూడా ఈ దరిదాపుల్లోకి రావడం లేదని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండప్రాంత అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టీ కోట్ల రూపాయలు వెచ్చించి కొండంచున ఉన్న చివరింటి వరకు కూడా రోడ్లు, మంచినీటి పైప్ లైన్, మెట్లు,ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు. ఈ డివిజన్ లో పర్యటించినప్పుడు ఈ రోడ్డు గురుంచి స్థానిక మహిళలు మా దృష్టికి తీసుకురాగా తక్షణమే కౌన్సిల్ లో పెట్టించి నిధులు మంజూరు చేపించడం జరిగిందని అన్నారు. శంకుస్థాపన చేయడమే కాకుండా నెలరోజుల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు. నిన్న సీఐడీ విచారణ నుండి బయటకు వచ్చిన నారా లోకేష్ మేకపోతు గంబిర్యం ప్రదర్శిస్తూ అధికారులు అడిగిన ప్రశ్నలకు గూగుల్ లో సమాధానాలు దొరుకుతాయని ఏటకారంగా మాట్లాడారని, ఐదేళ్ళ లో మీరు చేసిన అవినీతి, దోచుకున్న సొమ్ము ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. వారి అనుకూల మీడియా చూస్తుంటే వారికి అసలు పత్రిక విలువలు ఉన్నాయా అని అనుమానం వేస్తుంది అని, ప్రభుత్వం చేస్తున్న మంచిని విమర్శించడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క వార్త అయిన రాస్తున్నార అని ప్రశ్నించారు. మీరెన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల సంపూర్ణ మద్దతు గెలుచుకొన్నామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,తూర్పు కాపు డైరక్టర్ ఇజ్జాడ తేజేష్,డివిజన్ అధ్యక్షులు లంకా అబ్బి నాయుడు వై
Prajavartha Online Telugu News