Breaking News

జూనియర్ డాక్టర్ల (ఎపి జూడా) రాష్ట్రవ్యాప్త సమ్మెకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. మద్దతు తెలుపుతుంది…

-రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణపై ప్రభావం పడకుండా అత్యవసర పరిస్థితులు ఏర్పడకుండా చూడాలి.
-జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లతో చర్చలు జరపాలి.
-ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక పని భారం వలన పెరుగుతున్న ధరలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టైఫ్ ఫండ్ ను పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఈ నెల 11వ తేదీ నుండి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి జూనియర్ డాక్టర్లతో సంప్రదింపులు చేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని, రాష్ట్రంలో రోగులకు ఇబ్బంది కలిగే విధంగా అత్యవసర పరిస్థితులు తీసుకురాకుండా ముందుగానే జాగ్రత్త పడాలని ఇప్పటికే కొన్నిచోట్ల సమ్మె ప్రభావం పడి పలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో సాధారణ మరియు అత్యవసర సేవలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయని దీంతో ఆసుపత్రులలో ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేని పక్షంలో వారు చేసే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) తరుపున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడమైనదన్నారు ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *