-రు.5.50 లక్షల మేర చెక్కుల పంపిణీ
-క్రీడాకారుడు అర్జీ బాలకృష్ణ కు రూ .2.50 లక్షల చెక్కు అందచేత
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న నేపథ్యంలో పలువురు అర్జీదారుల సమస్య తెలుసుకుని తక్షణం వారిని ఆదుకోవాలని ఆదేశించడం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అర్జి దారులకు కలెక్టర్ చెక్కులను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత వివరాలు తెలుపుతూ, మొత్తం ఆరు మంది అర్జీదారులకి రూ 5 లక్షల యాభై వేల తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. సిఎం ఇచ్చిన హామీ మేరకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం కి చెందిన అర్జీ బాలకృష్ణ, ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి 18 వరకు జరిగే జొహర్తాపా మలేషియాలో జరిగే బరువు 75 కిలోల కేటగిరీ పోటీలకి అర్హత సాధించారని, క్రీడల్లో పాల్గొనేందుకు ప్రయాణ ఖర్చు, ఇతర ఖర్చుల కోసం రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించారన్నారు. ఈమేరకు స్పందించిన ముఖ్యమంత్రి అల్ ది బెస్ట్ చెపుతూ, రాష్ట్రం యొక్క కీర్తిని ఇనుమడింప చెయ్యాలని అభిలాష వ్యక్తం చేశారు. సిఎం ఆదేశాల మేరకు అర్జీ బాలకృష్ణ కి రూ.2.50 లక్షల చెక్కు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందజేయడం జరుగుతుంది అనడానికి ఇటువంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఆర్థిక సహాయం కోరిన అర్జి దారుల్లో డా. అంబేద్కర్ కోనసీమ జిల్లా , అన్నవరం గ్రామానికి చెందిన పెయ్యాల బాబురావు గుడాల, కళ్లు కనిపించడం లేదని తెలియ చెయ్యగా రూ.1.00 లక్షల మంజూరు చేస్తూ చెక్కును, మల్కిపురం మండలం, గుడపల్లి గ్రామానికి చెందిన రాపాక వెంకట సూర్య నారాయణ కు రు.25 వేలు, పి. గన్నవరం మండలం, వాడపల్లి గ్రామానికి చెందిన దాకే చంద్ర ఫణి కుమార్ రు. 1.00 లక్షల చెక్కు, ఆర్ధిక సహాయం మంజూరు కొరకు అభ్యర్థన పెనుగొండ మండలం,పెనుగొండ గ్రామానికి చెందిన కే. లక్ష్మి కుమారి తండ్రి అకస్మాత్తుగా మరణించడం తో ఆర్థిక సాయం కోసం అర్జి చేసుకోగా రు. 50 వేలు చెక్కు , ఉద్యోగం కొరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు సిఫారస్సు చెయ్యడం జరిగిందన్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ ఆర్ధిక సహాయం కోసం కోరగా రు.25 వేలు చెక్కు ఇవ్వడం జరిగిందన్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన తోట ఇంద్ర కుమారిఇంటి స్థలం పట్టా కోసం అభ్యర్థన చెయ్యడం జరిగిందని, తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.