Breaking News

నీతి ఆయోగ్ వర్కుషాపులో ఇంధనం, పరిశ్రమలపై సమగ్ర చర్చ

-రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు కొనసాగిన వర్కుషాపు
-ఉత్పాదక రంగాలైన ఇంధనం,రవాణా,ఐటి, పర్యాటకం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, చేనేత&వస్త్ర, గృహ, టిడ్కో అంశాలపై దృక్కోణ ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు
-వర్కుషాపులో పాల్గొన్న సచివాలయ, విభాగాల అధిపతులతో పాటు ప్రాంతీయ, జిల్లా స్థాయి అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్-2047 లో భాగంగా నీతి ఆయోగ్ సహకారంతో స్టేట్ విజన్ ప్లాన్-2047 ను రూపొందించేందుకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న వర్కుషాపు రెండో రోజైన గురువారం కూడా కొనసాగింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా అధ్యక్షతన జరిగిన ఈ రెండో రోజు వర్కుషాపులో ఉత్పాదక రంగానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై సుదీర్ఝ చర్చజరిగింది. ఈ రెండో రోజు వర్కుషాపులో భాగంగా ఉదయం ఇంధనం, రవాణా, ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్, పర్యాటకం అంశాలపై మరియు మధ్యాహ్నం నుండి పరిశ్రమలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, ఎపిఐఐసి, ఇ.డి.బి., ఏపిజిడిసి, ఫుడ్ ప్రోసెసింగ్, మైనింగ్, ఏపిఎండిసి, చేనేత&వస్త్ర, గృహ, టిడ్కో మరియు సంబంధిత అంశాలపై దృక్కోణ ప్రణాళికలను రూపొందించేందుకు నీతి ఆయోగ్, రాష్ట్ర అధికారులు సమగ్ర స్థాయిలో సుదీర్ఝ చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఆయా రంగాల వారీగా ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను సంబంధిత శాఖల అధికారులు నీతి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. రంగాల వారీగా ఉన్న బలహీనతలను అధిగమించేందుకు, సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అనుగుణంగా వ్యూహాత్మక దృక్కోణ ప్రణాళికలతో రాష్ట్ర విజన్ ప్లాన్ – 2047 రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు, సలహాలను నీతి ఆయోగ్ అధికారులు రాష్ట్ర అధికారులకు అందజేశారు.
రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్, రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సి.ఎస్. కె.విజయానంద్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపిజన్కో డైరెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్ బాబు, నెడ్ క్యాప్ వి.సి. & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రమణారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.రాజేశ్వరరెడ్డి తదితరులతో పాటు నీతి ఆయోగ్ సలహాదారులు సిహెచ్. పార్థసారధి రెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణులు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సెల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ & మూల్యాంకన నిపుణులు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధి అభిషేక్ తదితరులు ఈ వర్కుషాపులో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *