– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 32వ డివిజన్ బసవతారకనగర్లో రూ. 21.59 లక్షలతో అభివృద్ధి పరచిన రోడ్లను కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్ తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. 2014లో టీడీపీకి వేసిన ఓటు నియోజకవర్గాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చిట్టచివరి గడప వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనపడేవని.. ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 7 కోట్ల మేర అభివృద్ధి పనులు డివిజన్లో చేపట్టినట్లు వెల్లడించారు. రూ. 40 లక్షలతో ఆర్చ్ రోడ్డును, రూ. 15.35 లక్షలతో శానిటరీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో భాగంగా ప్రారంభించుకున్న అయోధ్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్.. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే గత ప్రభుత్వం చేతగాక వదిలేసిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాన్ని.. ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని రూ. 17 లక్షలతో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గాన్ని ఏపీలోనే మేటిగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్ల ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, నాయకులు ఒగ్గు గవాస్కర్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.