Breaking News

పేదలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 13.85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గంలో 21 మందికి మంజూరైన రూ. 13.85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో బుధవారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. వైద్య రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు నిరుపేదలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయన్నారు. సెంట్రల్లోని 1,69,376 కుటుంబాలకుగానూ.. 74,585 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. వీరందరికీ గత నాలుగున్నరేళ్లలో రూ. 160 కోట్ల విలువైన వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు ఈనెల 18 నుంచి కొత్త కార్డులను పంపిణీ చేయనున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ కార్డుల ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యానికి ప్రభుత్వం భరోసాని కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కొత్త కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత క్యాంపులను ఇప్పటికే విజయవంతంగా నిర్వహించుకోగా.. జనవరి 1 నుంచి రెండో విడత క్యాంపులు ప్రారంభం కానున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. అలాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,200 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతిఒక్కరూ తమ మొబైల్స్ లో ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా.. సమీపంలోని నెట్ వర్క్ ఆస్పత్రుల వివరాలు, ఏ వ్యాధులకు ఏఏ ఆస్పత్రులలో వైద్యం అందుతుందో సమాచారం తెలుసుకోవడం సులభతరం అవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని రోగాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా వైద్యం చేయించుకోవచ్చని తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుల కుటుంబసభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ఇసరపు దేవీ రాజారమేష్, శర్వాణీ మూర్తి, జానారెడ్డి, కుక్కల అనిత, నాయకులు అలంపూర్ విజయ్, యరగొర్ల శ్రీరాములు, ఉమ్మడి వెంకట్రావు, గుండె సుందర్ పాల్, కురిటి శివ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *