-వైద్య విద్యార్థుల ద్వారా కుటుంబ దత్తత కార్యక్రమం
-150 మంది వైద్య విద్యార్థులచే 750 మంది కుటుంబాల దత్తత
-ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మెడికల్ కౌన్సిల్ వారి మార్గదర్శకాలు మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇవ్వడం జరిగిందని ప్రిన్సిపాల్/అడిషనల్ డి.ఎం.ఇ, డా బి. సౌభగ్య లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం పై సూపరింటెండెంట్ జీ జి హెచ్ మరియు హెచ్ వో డి కమ్యూనిటీ మెడిసిన్ – డా ఎమ్ఎల్ .సూర్యప్రభ , వైస్ ప్రిన్సిపల్ కేవి శివ ప్రసాద్, నోడల్ అధికారి -డా.పి.మనోజ్ హెల్త్ ఎడ్యుకేటర్ ఆర్. శ్రీనివాస్, ఆధ్వర్యంలో జీ.ఎమ్.సి లో శిక్షణ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్/అడిషనల్ డి.ఎం.ఇ, డా బి. సౌభగ్య లక్ష్మి మాట్లాడుతూ , జాతీయ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థుల కు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రాం ను అనుసంధానం చేయడం జరుగుతోందని అన్నారు. ఆ మేరకు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న అన్నమాచారి రోడ్, దుర్గా నగర్, వాంబే కాలనీ లోని 750 మంది కుటుంబాలను 150 మంది మెడికల్ విద్యార్థులు ఒకొక్కరు 5 కుటుంబాలను దత్తత తీసుకుని వారితో అనుబంధం పెంచుకోవడం జరుగుతుందని అన్నారు. వారికి వైద్య, ఆరోగ్య పరంగా సూచనలు, సలహాలు అందిస్తూ ఐదు సంవత్సరాలు పాటు ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చెయ్యడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. నోడల్ అధికారి -డా.పి.మనోజ్ ఆధ్వర్యంలో పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను చెప్పట్ట నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డా వి సూర్యారావు, డా కె.. దీప్తి, డా పి. మనోజ్, వైస్ ప్రిన్సిపల్ కేవి శివ ప్రసాద్, నోడల్ అధికారి -డా.పి.మనోజ్ , హెల్త్ ఎడ్యుకేటర్ ఆర్. శ్రీనివాస్, మొదటి ఏడాది మెడికల్ విద్యార్థులు, ఏ ఎన్ ఎమ్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.