Breaking News

రీ సర్వే కి చెందిన భూ సర్వే, స్టోన్ ప్లాంటేషన్ , గ్రౌండ్ ట్రూ ధింగ్ పనులు వేగవంతం చేయాలి

-4 వ దశ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక ప్రకారం పూర్తి చెయ్యాలి
-సీసీ ఎల్ ఏ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చెయ్యాలి
-జేకేసీ అర్జీలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి
-జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపడుతున్న రీ సర్వే పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చెయ్యడం పై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో సర్వే శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో రీ సర్వే పనులకు చెంది మరమ్మతులకు గురి అయిన 14 డ్రోన్స్ బదులు పనులను వేగవంతం 10 డ్రోన్స్ అవసరం ఉన్న దృష్ట్యా ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మరో 10 గ్రామాలకు సంబంధించి సరిహద్దు రాళ్ళు ను జిల్లాకు పంపించడం జరిగిందని, అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. రి సర్వే స్టోన్ ప్లాంటేషన్ 3వ ఫేజ్ నందు 100 గ్రామాలకు గాను 58 గ్రామాలకు రాళ్ళు సరఫరా చేశారన్నారు. ఇప్పటి వరకు 25 గ్రామాలు స్టోన్ ప్లాంటేషన్ పూర్తి చేసి ఉన్నారు . మిగిలిన 33 గ్రామాలకు జనవరి 15 నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. మరో 10 గ్రామాలలో చేపట్టవలసి ఉన్న వాటికి చెందిన సరిహద్దు రాళ్ళు సరఫరా చేశారన్నారు. ఎఫ్-లైన్స్ ,పట్టా సబ్ డివిజన్ మరియు ఆన్లైన్ సబ్ డివిజన్ పెండింగ్ మీద రివ్యూ చేసి పెండింగ్ వాటిని ఎస్ ఎల్ ఏ లోపు పూర్తి చేయలన్నారు. రీ సర్వే లో భాగంగా ఇస్తున్న జాయింట్ ఎల్ పి ఎమ్ ఎస్ మీద సిసీఎల్ఏ వారు ఇచ్చిన ఆదేశములను గ్రామ మరియు మండల సర్వేయర్లకు తగు సూచనలు చేయటం జరిగిందన్నారు. సర్వే కి సంబందించిన జగనన్న కు చెపుదాం అర్జీ లను త్వరితగతిన పూర్తి చేయవలన్నారు. నాల్గోవ దశ గ్రౌండ్ ట్రూథింగ్ జరుగుతున 46 గ్రామాలకు చెందిన పురోగతిపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సహాయ సంచాలకులు సర్వే శ్రీమతి ఎమ్. జ్యోషి, డివిజన్ మండల సర్వేయర్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *