Breaking News

జిల్లా వ్యవసాయ మండలి సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన మిచొంగ్ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు భరోసా ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ మండలి సమావేశంకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మిచొంగ్ తుఫాను కారణంగా మండలాలు వారీగా పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగు తుందన్నారు. జిల్లాలో 15677 హెక్టార్ల పంట నష్టం జరిగిందని, ఇందుకు సంబంధించి రూ.21.44 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరం అవుతుందని, ఆమేరకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఇప్పటి వరకు 5157.37 హెక్టార్ల లో అంచనాలు పూర్తి చేశారన్నారు.

70826 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 59788 హెక్టార్ల లో కోతలు పూర్తి అయ్యాయని తెలిపారు. మిచొంగ్ తుఫాను హెచ్చరికల ను డిసెంబర్ మొదటి రోజు నుంచి భారీ వర్షాల పై సూచనలు చేస్తూ రైతులను హెచ్చరించడం జరిగిందన్నారు. అప్పటికే జిల్లాలో 65 శాతం కోతలు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. రెండు, మూడు తేదీల్లో కోతలు కోసిన పంటలకు మిల్లులకు తరలించి, ఆఫ్ లైన్ ద్వారా కొనుగోళ్లు చేశామన్నారు. వాటి వివరాలు ఆన్లైన్ లో క్రోడీకరించి నట్లు పేర్కొన్నారు. పంట నష్టం అంచనా కోసం గ్రామ స్థాయిలో కమిటీ లను వేసి డిసెంబర్ 18 నాటిని ఎన్యూమరేషన్ పూర్తి చేసి, డిసెంబర్ 23 నాటికి జిల్లా స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు.  ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం నివారణ కోసం తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు తప్పని సరి అని స్పష్టం చేశారు.  ఆమేరకు మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. పొగాకు నారుకి తీవ్ర నష్టం కలిగిందని, బ్యాంకు రుణాలను రీ షెడ్యూల్ చెయ్యాలని రైతులు కోరగా, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని జాయింట్ కలెక్టర్ తెలియ చేశారు.

ఈ సమావేశంలో ఆదర్శ రైతులు వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, హార్టికల్చర్ అధికారి సరస్వతి, డి ఎ హెచ్ ఎస్ జీ టి సత్య గోవింద్,  ఎస్ ఈ ఇరిగేషన్ శ్రీనివాస రావు, సిపివో ఎ. ముఖ్య లింగం, ఎల్ డి ఎం డివి ప్రసాద్, సభ్యులు , ఆదర్శ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *