Breaking News

డిసెంబర్ 22, 23 తేదీల్లో రాష్ట్ర ఎలక్షన్ డి ఈ ఓ లతో వెలగపూడి లో సమావేశం

-పెండింగ్ దరఖాస్తులు డిసెంబర్ 20 నాటికి పూర్తి చేయాలి
-జేసీ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సమావేశం కు సంబందించిన అంశాలపై నివేదికలను 20 వ తేదీ కల్లా అందచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జేసీ ఛాంబర్ నుంచిన్ జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తో కలిసి నియోజక వర్గ, ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్వోలు, ఎన్నికల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తో డిసెంబర్ 26 న తుది డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటన నేపథ్యంలో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఐ సి డి ఎస్ అధికారి తో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ ఆదేశాలు జారీ చేస్తూ, డిసెంబర్ 22 , 23 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెలగపూడి లో అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారుల (డి ఈ వో) తో డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటన నేపథ్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తేజ్ భరత్ తెలిపారు. అందు కోసం నియోజక వర్గాల వారీగా సమగ్ర సమాచారం కోరడం జరిగిందన్నారు. వాటికి సంబంధించి వివరాలు డిసెంబర్ 20 నాటికి అందచెయ్యలన్నారు.

తూర్పు గోదావరి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు మరింత పారదర్శకంగా, జవాబుదారీ తనం కలిగి ఉండే విధంగా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఆ క్రమంలో జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, వివిధ కేటగిరీల వారీగా ఓటర్ల నిష్పత్తి ఉండాలన్నారు. ప్రతి నియోజక వర్గంలో నాలుగైదు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఆమేరకు వాస్తవ సంఖ్యను ప్రతిబింబించే విధంగా తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. యువ ఓటర్ల నమోదు చేయండం లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను సాధించలన్నారు.

నియోజక వర్గాల వారీగా పెండింగు లో ఉన్న ఫారం 6 , 7 , 8 , 6 బి లని డిసెంబర్ 20 నాటికి 100 శాతం పరిష్కారం చేసి, ఎన్నికల కమిషన్ ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ అప్లోడ్ చేయాలన్నారు. డిసెంబర్ 26 వ తేదీన నమూనా తుది ఓటరు జాబితా ప్రకటన చెయ్యాల్సి ఉన్న దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పెండింగు పనులు పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో జేసీ ఛాంబర్ నుంచి డిఆర్వో జి. నరసింహులు, కలెక్టరేట్ సిబ్బంది, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్వోలు పాల్గొన్నారు.

అంగన్వాడీ సిబ్బంది సమ్మె నేపథ్యం పై
జిల్లాలోని 1556 అంగన్వాడీ కేంద్రాల ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 1553 కేంద్రాలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఆయా కేంద్ర ల పరిధిలో ఉన్న చిన్నారులకు సమీప మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న స్కూల్స్ ద్వారా ఆహారం అందించడం జరిగిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహయకుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని విషయాన్ని వారికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి పై ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విజయ కుమారి తో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *