Breaking News

కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ లో అంతర్జాతీయ సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ సొసైటీ ఆఫ్ టొబాకో సైన్స్ (ISTS) కాన్ఫరెన్స్ రెండో రోజున ఈ క్రింది రెండు అంశాలపై చర్చ జరిగింది.

‘వాణిజ్య వ్యవసాయం కోసం పంట నిర్వహణలో వాతావరణ అనుకులిత నూతన మార్గాలు’
‘కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం లో కొత్త దృక్కోణాలు మరియు విలువ జోడింపు
డాక్టర్ పి.ఎస్. బ్రహ్మానంద్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, వాటర్‌ టెక్నాలజీ సెంటర్‌, న్యూఢిల్లీ ఈ సెషన్‌కు ఛైర్మన్‌గా, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ అండ్‌ ఆరోమాటిక్‌ ప్లాంట్స్‌ బెంగళూరులోని రీసెర్చ్‌ సెంటర్‌, మాజీ హెడ్‌ డాక్టర్‌ ఈవీఎస్‌ ప్రకాశరావు, కో-ఛైర్మన్‌గా, ఈ సెషన్‌కు రిపోర్టర్‌గా క్రాప్ మేనేజ్‌మెంట్ హెడ్ డాక్టర్‌ కే రాజశేఖర్‌ రావు వ్యవహరించారు. ఈ సెషన్‌లో మూడు వేర్వేరు ప్లీనరీ ఉపన్యాసాలు ప్రదర్శించబడ్డాయి.

థాయ్‌లాండ్‌లోని అలయన్స్ వన్ ఇంటర్నేషనల్, ఆసియా ప్రాంతీయ వ్యవసాయ శాస్త్ర డైరెక్టర్ శ్రీ సిల్వేరియా లియాండ్రో, అప్రోచ్ & పొగాకు సప్లై చైన్‌పై సాధ్యమైన ప్రభావాలు’ అనే అంశంపై ఉపన్యాసం అందించారు. ‘పొగాకు రైతుల పర్యావరణ, సామాజిక మరియు పాలన (ESG) అంశాలపై ఈ సంస్థ కేంద్రీకరించిందని, ఆసియాలోని భారతదేశం, చైనా, థాయ్‌లాండ్ మరియు ఇండోనేషియా దేశాలలో వారు 16,000 మంది పొగాకు పెంపకందారుల జీవనోపాధి మెరుగుదలపై దృష్టి సారిస్తున్నారు. ఆహారం, గృహాలు మరియు వాతావరణ మార్పులు మరియు పర్యావరణ విపత్తుల కోసం రైతులను సంసిద్ధం చేయడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి నిలకడగా ఉండేలా నిర్ణీత లక్ష్యాలతో, సాంకేతిక బ్యాకప్‌తో చిన్న మరియు సన్నకారు రైతులపై దృష్టి సారిస్తున్నామని, అటవీ సంరక్షణ, మహిళా సాధికారత, నీటి యాజమాన్యం, యాంత్రీకరణ మొదలైనవాటిని ప్రోత్సహిస్తున్నామని తెలియచేసారు.

USAలోని కాన్సాస్ స్టేట్ యూనివర్శిటీలోని సస్టైనబుల్ ఇంటెన్సిఫికేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్ (SIIL) డైరెక్టర్ డాక్టర్. P V వర ప్రసాద్, ‘సుస్థిర వ్యవసాయాభివృద్ధి కొరకు భవిష్యత్ పంటల యాజమాన్యం’ అనే అంశంపై ఉపన్యాసం అందించారు. అతను ప్రపంచవ్యాప్తంగా ఆహార అభద్రత పరిస్థితి గురించి మాట్లాడారు. వాతావరణ ఉష్ణోగ్రతల పెరుగుదలను పేర్కొనడం ద్వారా వాతావరణ మార్పు సమస్యల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని, ఖచ్చితమైన మరియు డిజిటల్ వ్యవసాయ సాధనాలతో కృత్రిమ మేధస్సు పంట ఉత్పాదకత, వనరుల వినియోగ సామర్థ్యం మరియు పంట నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని తద్వారా స్థిరమైన వ్యవసాయ తీవ్రతకు మద్దతు ఇస్తుంలని వ్యవసాయంలో సీ అండ్ స్ప్రే టెక్నాలజీ, ప్లాంటిక్స్ (క్రాప్ డాక్టర్) యాప్, స్మార్ట్ ఫెర్టిగేషన్, సాయిల్ గ్రిడ్‌లు మొదలైన కొన్ని AI సాధనాల వినియోగాన్ని ఆయన వివరించారు.
డాక్టర్ మైఖేల్ J స్టౌట్, ప్రొఫెసర్ & డిపార్ట్‌మెంట్ హెడ్, ఎంటమాలజీ డిపార్ట్‌మెంట్, లౌసియానా స్టేట్ యూనివర్సిటీ, ఆన్‌లైన్‌లో తమ ఉపన్యాసం అందించారు మరియు ‘సమగ్ర సస్యరక్షణ విధానం ద్వారా పంటల సంరక్షణ – అవకాశాలు మరియు సవాళ్లు’ అనే అంశంపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఆయన వారిలో మొక్కలు – కీటకాల పరస్పర చర్యలపై పరిశోధనలు చేసి, వ్యాధి నిరోధకత మరియు వరిలో మైకోరేజాతో విత్తన సుద్ధి ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వంటి వినూత్న పరిశోధనలను వివరించారు.

CSIR-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, రీసెర్చ్ సెంటర్, బెంగళూరు మాజీ అధిపతి డాక్టర్ ఈవీఎస్ ప్రకాశరావు ‘వాణిజ్య వ్యవసాయంలో వైవిధ్యం కోసం ఔషధ మరియు సుగంధ పంటలు’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 20,000 మొక్కలు, భారతదేశంలో 2,500 మొక్కలను WHO గుర్తించిందని ఆయన తెలియజేశారు. జాతీయ ఔషధ మొక్కల బోర్డు (NMPB) సబ్సిడీపై 85 మొక్కలను ఔషధ మొక్కలుగా గుర్తించిందని, ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు సాగు చేసే ప్రాంతాలలో అశ్వగంధతో సహా ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకం యొక్క వ్యయ ప్రయోజన నిష్పత్తి మరియు ఆర్థిక అంశాల గురించి ఆయన మాట్లాడారు.

డాక్టర్ J. కృష్ణ ప్రసాద్‌జీ, ప్లాంట్ పాథాలజీ ప్రొఫెసర్ (రిటైర్డ్.) & అగ్రికల్చర్ మాజీ డీన్, ANGRAU ‘పసుపు పంటను వివిధ రకాలుగా వినియోగం ‘ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. దేశ వాణిజ్యం మెరుగుపరచడం కోసం పసుపు నాణ్యత ప్రమాణాలను పెంచుకోవడం, వివిధ పసుపు పంట రకాలు, పసుపు లక్షణాలు, నాణ్యత అవసరాలు, మంచి వ్యవసాయ పద్ధతులు, క్లిష్టమైన దశలలో పోషకాల మరియు నీటి యాజమాన్యం, వివరించాడు. నార్త్ ఈస్ట్ హిల్లీ రీజియన్‌లో పండే లకడాంగ్ రకం పసుపుకు భౌగోళిక సూచిక (జిఐ) గుర్తింపు ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ పి.ఎస్. బ్రహ్మానంద్, ప్రాజెక్ట్ డైరెక్టర్, వాటర్ టెక్నాలజీ సెంటర్, న్యూఢిల్లీ, వాణిజ్య పంటల ఉత్పాదకతను పెంపొందించడానికి సుస్థిరమైన నీటి యాజమాన్యం – సాంకేతిక పరిజ్ఞానంపై వివరణాత్మక ప్రదర్శనను అందించారు. వాటర్‌షెడ్‌ల కోసం ఫ్లెక్సీ రబ్బర్ డ్యామ్‌లు, సోలార్ పవర్ ద్వారా నెలలోని తేమ స్థితిగతులు, సెన్సార్ ఆధారిత నీటిపారుదల వ్యవస్థలు, డ్రోన్ ఆధారిత నీటి ఎద్దడి – పర్యవేక్షణ మొదలైన అంశాలను ఆయన వివరించారు.
థీమ్-2:-
ICAR-భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ T. K. బెహెరా చైర్మన్‌గాను, ICAR-భారతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ R. దినేష్ కో-చైర్మన్‌గా మరియు డాక్టర్ నమితా దాస్ సాహా ర్యాపోర్టియర్ గాను వ్యవహరించారు.

డాక్టర్ ఎన్‌టిఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ANGRAU ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌ సిహెచ్‌వివి సత్యనారాయణ ‘పొగాకుకు ప్రత్యామ్నాయంగా అధిక విలువైన వాణిజ్య పంటలకు విలువ జోడింపులో భవిష్యత్ లో సాంకేతిక పరిజ్ఞానం ప్రాసెసింగ్ టెక్నాలజీలు’ అనే అంశంపై ప్రసంగించారు. వాణిజ్య పంటల కర్కుమిన్ మరియు ఇతర బయో-యాక్టివ్ రసాయనాలను వెలికితీసే ప్రాసెసింగ్ పద్ధతులు మరియు సాంకేతిక విధానాలు, పసుపు, మిరపకాయ, ఆముదం మరియు అశ్వగంధ యొక్క విలువ జోడించిన ఉత్పత్తులు మరియు ఉప ఉత్పత్తులను వివరించారు.

ఈ సెషన్‌లో, హర్యానాలో సోనేపట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మేనేజ్‌మెంట్ (NIFTEM) సంస్థ వ్యవసాయం మరియు పర్యావరణ శాస్త్రాల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ భీమ్ ప్రతాప్ సింగ్ పసుపులో విలువ జోడింపు ఉత్పత్తులపై ఉపన్యాసం ఇచ్చారు. సాంకేతికత మరియు ఇతర కీలకమైన ఇన్‌పుట్‌లు, లైసెన్సింగ్, మార్కెటింగ్ ద్వారా ఆసక్తి గల విద్యార్థులను కుటీర పరిశ్రమల వ్యవస్థాపకులుగా ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ఈ సంస్థ గ్రామీణ యువతకు తోడ్పాటు అందించడం కోసం ఫుడ్ టెక్నాలజీలో అద్భుతమైన ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌ను కలిగి ఉందని ఉపన్యసించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 500 మంది ప్రతినిధులు మరియు 330 మంది పరిశోధకులు & విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, కోఆర్డినేటర్లను మరియు ఇతర ప్రముఖులను ఐసీఏఆర్-సీటీఆర్‌ఐ డైరెక్టర్ ఐ ఎస్ టి ఎస్ ప్రెసిడెంట్ డా. మాగంటి శేషు మాధవ్ సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *