Breaking News

కేంద్ర కారాగారంలో సోషల్ ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కారాగారం లోని ఖైదీల నేర ప్రవృత్తిని తగ్గించి శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి కేంద్రకారాగారం , రాజమహేంద్రవరం లో “సోషల్ ఇంకుబేషన్ సెంటర్” ను తొలిసారిగా కేంద్రకారాగారము సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ శుక్రవారం ప్రారంభించినారు. ఈ “సోషల్ ఇంకుబేషన్ సెంటర్” లు ఖైదీలలో గొప్ప పరివర్తనకు ఎంతో దోహతపడతాయని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారము సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ పేర్కొన్నారు. వివిధ రంగాల్లో నిష్టాతులైన ప్రముఖులను సభ్యులుగా తీసుకొని, తొలి సమావేశం శ రాహుల్ గారి అధ్యక్షతన శుక్రవారం ది.15.12.2023 న సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగినది. అదనపు సూపరింటెండెంట్ డి. రాఘవేంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్., యం. రాజకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ ఖైదీలకు ప్రత్యేకమైన ప్రోఫార్మ తయారు చేసి తదనుగుణంగా వారిమీద ఎక్కువ సమయం కేటాయించి, అనుభవజ్ఞలైన సైకాలజిష్టులతో కౌన్సిలింగ్ ఇస్తే సత్ఫలితాలు ఉంటాయన్నారు. సైక్రియాట్రిస్ట్ ల శిక్షణతో సరైన సమయంలో స్పందించ గలిగితే ఆత్మహత్యలను కూడా నివారించవచ్చు అన్నారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ యం. రాజకుమార్ మాట్లాడుతూ కొందరు ఖైదీలు సున్నితంగా ఉండి చాలా చిన్న విషయానికి కూడా భాధపడి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అటువంటి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. మరో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ సయ్యద్ మోహిబుర్ రెహమాన్ మాటాడుతూ ఖైదీలకు శిక్షా కాలంలో జీవన నైపుణ్యాన్ని నేర్పలన్నారు. ఖైదీల కౌన్సిలింగ్ సమయంలో కుటుంబసభ్యులు కూడా ఉంటే ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందని డాక్టర్ ప్రియాంక., .డా!! కోమలి, డా!! అన్నపూర్ణ, తదితరులు పేర్కొన్నారు.

విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించేందుకు, అలాగే ఖైదీల తాలుకా కుటుంబ సభ్యుల జీవన భృతికి చిన్న తరహా పారిశ్రామిక ఉపాధి కల్పనా సంస్థ ద్వారా అనేక పధకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు తాము కావలసిన సహకారం అందిస్తామని ఇండస్ట్రీస్ సలహా మండలి సభ్యులు ఎన్. వెంకట్రావు, స్వర్ణాంద్ర సేవాసమితి సభ్యులు గుబ్బల రాంబాబు పేర్కొన్నారు.

విద్య ద్వారానే నేర ప్రవృత్తి తగ్గుతుందనీ, అందుకోసం తాము ఖైదీలకు కూడా విద్యను అందించేందుకు జైళ్లలో కూడా విద్య సేవలు అందిస్తున్నామని రాజమండ్రి ఉప విద్యాశాఖాధికారి నారాయణ అన్నారు. తరచూ సమావేశమై ఉమ్మడి ప్రణాళికలతో ప్రత్యక దృష్టి సారించి ఇటు జైళ్లలో ఖైదీల మనస్తత్వం మార్చి, తద్వారా సమాజ శాంతికి తోడ్పడదామని సూపరింటెండెంట్ రాహుల్ పేర్కొన్నారు.

కారాగాల్లో సామజిక పరివర్తనా కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ జైళ్ళ శాఖ డి.జి. గారి ప్రణాళిక అనీ, దీన్ని అందరు కలిసి విజయవంతం చేద్దామన్నారు.

ఈ కార్యక్రమం లో కారాగార సంక్షేమ అధికారి ఆర్ . శ్రీనివాసులు, సైకాలజిస్ట్ యన్. సన్ షైన్., జాతీయ ఉత్తమ ఉపాద్యాయుడు చిలుకూరి శ్రీనివాస రావు, ఇంటర్మీడియట్ శాఖాధికారి సుబ్రహ్మణ్యం, డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంకర్ డి.వి. ప్రసాద్, తదితరులు పాల్గొని ఖైదీల సంక్షేమం మరియు వారిలో పరివర్తన కోసం చర్చించి ప్రణాళికలు రూపొందించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *