-ఎస్సీ వెల్ఫేర్ అధికారి ఎం.సందీప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి ఎం. సందీప్ శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. సామాజికంగా, విద్యాపరంగా, అర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులకు ప్రోత్సహకంగా ప్రభుత్వం ఆర్థిక సహయం అందజేస్తుందన్నారు. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను 2023 లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో అర్హత సాదించిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ నెల 19వ తేదీ లోపు jnanabhumi.ap.gov.in లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.