Breaking News

రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ మరియు బాల్ రంగ్ పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ మరియు బాల్ రంగ్ – 2023-24 పోటీలు (14, 15 తేదీలలో) రెండు రోజులపాటు స్థానిక మురళి రిసార్ట్ విజయవాడ నందు ఘనంగా నిర్వహించడం జరిగినది. రాష్ట్రస్థాయిలో 10 విభాగాలలో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించడం జరిగింది. 142 మంది అభ్యర్థులు పాల్గొనగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు గాను మొత్తం 60 మంది విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ప్రతి విభాగంలోనూ అబ్బాయిలలో ఒకరికి అమ్మాయిలలో ఒకరిని జాతీయస్థాయి పోటీలకు ఎన్నుకోవడం జరిగినది. బాల్ రంగ్ పోటీలకు గాను ప్రతి టీం నందు 15 మంది చొప్పున ఐదు టీములు థింస మరియు తప్పిట గుండ్లు తదితర అంశాలలో పాల్గొనడం జరిగినది.అందులో థింస నృత్యానికి ప్రథమ బహుమతి లభించింది. ఈ బృందం జాతీయస్థాయిలో తమ ప్రదర్శనను ఇవ్వనుంది
బహుమతి ప్రధానోత్సవానికి విచ్చేసిన సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు కళలను విద్యను సమ్మిళితం చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చునని తెలియజేశారు. జాతీయస్థాయిలో జరిగే వివిధ రకాలైనటువంటి పోటీలలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటుతున్నారని తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో గెలిచినటువంటి అభ్యర్థులందరూ జాతీయస్థాయిలో మంచి బహుమతులు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

సర్వ శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ సి ఆర్ టి డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, సామో జేడి విజయ్ కుమార్, కృష్ణా జిల్లా డీఈవో తాహెర్ సుల్తానా  మరియు పెనమలూరు జిల్లా విద్యా మండల శాఖ అధికారి కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *