అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్దులకు అవశ్యకమని అనంతపురం జిల్లా పరిషత్త్ ఛైర్మన్ బి. గిరిజమ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల క్రీడోత్సవాలు గురువారం అనంతపురం వేదికగా అట్టహాసంగా ప్రారంభించడం అయ్యాయి. ఈ సందర్బంగా గిరిజమ్మ మట్లాడుతూ మానసిక సమస్యలను అధికమించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. గౌరవ అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రభుత్వ పాలిటెక్నిక్ అనంతపురం లో జరగడం గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. హాజరైన అతిథులు వాలీబాల్ క్రీడను ప్రారంభ సూచకంగా ప్రారంభించారు. శాంతి కపోతాలను ఎగురవేసి పాలిటెక్నిక్ క్రీడలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రత్యేక అతిధిగా హాజరై క్రీడాజ్యోతిని వెలిగించిన సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి తోడ్పడతాయన్నారు. కమిషనర్ నాగరాణి, జిల్లా కలెక్టర్ గౌతమి కొద్దిసేపు టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులతో ముచ్చటించి ఉత్సాహ పరిచారు. ఈ క్రీడోత్సవాలకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి జయచంద్ర రెడ్డి అధ్యక్షత వహించారు. ఎంపిటిసి ఆర్.ఆశా జ్యోతి, సర్పంచ్ జి.ఉదయ్ శంకర్, ఆర్జేడిలు ఎ.నిర్మల్ కుమార్ ప్రియ, జె సత్యనారాయణ మూర్తి, సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి కె.వి రమణ బాబు తదితరలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర స్థాయి క్రీడలకు 26 జిల్లాల స్దాయిలో 13 ప్రాంతీయ పోటీల నుండి అర్హత సాధించిన 1400 క్రీడాకారులు 13 క్రీడాంశాలు, 6 ఆటల పోటీలలో పాల్గొంటున్నారు. క్రీడా ఉత్సవం ఆరవ తేదీ వరకు కొనసాగనుంది.
Tags ananthapuram
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …