వివిధ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలగపూడి నుంచి ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమం – జగనన్న ఆరోగ్య సురక్ష లు స్త్రీ, శిశు సంక్షేమం – అంగన్‌వాడీల పనితీరు; రెవెన్యూ అంశంగా 3వ దశ రీ-సర్వే, ఇనామ్ & అసైన్డ్ భూములు ఫ్రీహోల్డ్, మిచాంగ్ తుఫాను ఉపశమనం, కరువుపై సమీక్ష; పంచాయతీ రాజ్, ఉపాధిహామీ వేతన ఉత్పత్తి, జల్ జీవన్ మిషన్ అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత జిల్లా ప్రగతి పై వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కింద రూ.84.57 కోట్ల మేరకు ప్రతిపాదనలు మంజూరు చేసినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కింద నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి 50,144 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల మిచాంగ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న 18540 రైతు లకు చెందిన 11854 హెక్టార్ల కు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1782. 65 లక్షలకు ప్రతిపాదన పంపడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద 18 మండలాలు జనవరి నెల వరకు నిర్దేశించిన 48 లక్షల పని దినాలకు గాను ఇప్పటి వరకు 43.10 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద మొత్తం రు.10.80 కోట్ల మేర లక్షలకు గాను రు.10.41 కోట్ల మేరకు పనులను అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 6816 మందికి వైద్య చికిత్స కోసం సిఫార్సు చెయ్యగా 4745 మంది శస్త్ర చికిత్సలు చేయించుకోవడం జరిగిందనీ, 2791 మందికి కాంట్రాక్టు ఆపరేషన్ చేయించాల్సి ఉండగా 1233 మందికి చెయ్యడం జరిగిందని, 7117 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉండగా 5752 మందికి అందచేశమన్నరు. రెండవ దశ జే ఏ ఎస్ శిబిరాలు వివరాలు ప్రజలకు తెలియ చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు మాధవీలత పేర్కొన్నారు. 3 వ దశ స్టోన్ ప్లాంటేషన్ 100 గ్రామాల్లో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. భూ హక్కు పత్రాలు పంపిణీ లో భాగంగా 445 మందికి 837.90 ఎకరాలు పంపిణీ చేసి నూరుశాతం లక్ష్యాలను సాధించా మన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *