-జనవరి 19 న కులగణన కు శ్రీకారం
– మంత్రి వేణుగోపాల్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కార్యక్రమం ప్రారంభించటం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత , అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారత రత్న డా బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి నాటికి, నేటికీ, ఎన్నటికీ దేశానికి, మానవాళికి దిక్సూచి అన్నారు. భారతరత్న డా.బి. ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ రోజైన జనవరి 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో జరిగే కార్యక్రమంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఆ మహానేత స్ఫూర్తి తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఎంతో మేలు చెయ్యడం జరుగుతోందని అన్నారు. అదే రోజున రాష్ట్రంలో సామాజిక న్యాయం మరింతగా ప్రజలకు చెరువ చేసేందుకు కులగణన ప్రక్రియ చేపట్టడం జరుగుతున్నట్లు తెలియ చేశారు. ఈ సమావేశంలో ఆర్ ఎం సి అదనపు కమిషనర్ పి ఎమ్. సత్యవేణి, ఎంపీడీఓ లు డి. శ్రీనివాస రావు , కే. రత్న కుమారి పాల్గొన్నారు.