రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు అన్నారు.. శుక్రవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎ.సురేష్ బాబు ఆద్వర్యంలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని హోటల్స్ ఆకస్మి తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలోని రామ్ నగర్ లో గల హోటల్ దేవి టిఫిన్స్ సెంటర్ నందు డోమెస్టిక్ (గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుచున్న అన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా సదరు హోటల్ నందు 05 డోమెస్టిక్ (గృహ) సిలిండర్లు గుర్తించటమైనదన్నారు. సదరు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుట కారణముగా MSO రాజమహేంద్రవరం అర్బన్ వారు సదరు 05 డోమెస్టిక్ (గృహ) సిలిండర్లును స్వాధినపర్చుకొని హోటల్ దేవి టిఫిన్స ఓనర్ అయ్యిన ఎస్.సంతోష్ పై u/s 6A ఆఫ్ E.C. చట్టం 1955 & LPG (సరఫరా & పంపిణీ నియంత్రణ) ఆర్డర్ 2000 క్రింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.. ఈ సందర్భముగా ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి సురేష్ బాబు మాట్లాడుతూ డోమెస్టిక్(గృహ) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించియున్నారు. ఈ తనిఖిలలో కార్యాలయ సబ్-ఇన్స్పెక్టర్ జగన్నాధరెడ్డి, వ్యవసాయ అధికారి భార్గవ మహేష్, కానిస్టేబుల్స్ లోవరాజు, కిషోర్ మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …