Breaking News

మన అక్కా చెల్లెళ్ళు లక్షాధికారులు

-ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో వైయస్సార్ ఆసరా ద్వారా పూర్తిగా రుణ మాఫీ చేశాం
-రాష్ట్రవ్యాప్తంగా 4వ విడతలో 7,98,345 గ్రూపులకు రు. 25 వేల570 కోట్ల రూపాయలు  అందించాం.
-రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో నాలుగు విడతల్లో 2635 గ్రూపులకు రు.99.77 కోట్ల రుణమాఫీ
-ఒక్క 4వ విడతలోనే రు.2,635 గ్రూపులకు రు.22.77 కోట్ల జమ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రజా సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘ మహిళలను రుణ విముక్తులను చేస్తూ వై.యస్.ఆర్. ఆసరా పథకాన్ని 4 విడతల్లో అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపామని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం లో నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి హుకుంపేట “డి మార్ట్ ” ప్రక్కన గల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా అనేక సంస్కరణలు చేపట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా 7,98,395 గ్రూపులోని 79 లక్షల మంది సభ్యులకు రూ. 25 వేల 570 కోట్ల ఆసరా గా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు డ్వాక్రా రుణాలను పూర్తిగా చెల్లించి ఆర్థిక భరోసాను కల్పించామన్నారు
.ఒక్క రాజమండ్రి రూరల్ మండలం లోనే గత నాలుగు విడతలుగా ఆసరా పథకం క్రింద 2635 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు రు. 99.15 కోట్ల ను వైయస్సార్ ఆసరా ద్వారా అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఒక్క నాలుగో విడతలోనే రూరల్ మండలంలో రు.22.77 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్వయం సహాయ సంఘాల గ్రూపు సభ్యులకు పావలా వడ్డీ అందిస్తే, నేడు ముఖ్యమంత్రి జగనన్న ఆసరా పథకం ద్వారా పూర్తి రుణమాఫీ చేశారని మంత్రి పేర్కొన్నారు.మహిళల్లో ఆర్థిక చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా పీవీ నరసింహా రావు ప్రధానమంత్రిగా వారి ఆర్థిక పురోభివృద్ధికి  మైక్రో ఫైనాన్స్ సిస్టం ఏర్పాటు చేసి  మహిళలు పొదుపు చేసే సంస్కృతిని ప్రారంభించా రన్నారు. గత ప్రభుత్వం హాయాంలో రూ.285 కోట్లు రుణాలు తీసుకుంటే గడచిన పదేళ్లలో మహిళలు రూ.10 వేల కోట్ల వారి ఆర్థిక స్వాముల కొరకు పదివేల కోట్లు రుణాలను పొందాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అన్న మాట నిలుపు కోలేదన్నారు. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నాడు ఇచ్చిన హామీని నాలుగు దఫాలుగా ఆసరాగా రుణమాఫీ చెల్లించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు రూ.14 వేల కోట్లు రుణాలు తీసుకోగా, రుణమాఫీ చేస్తానని గ్రత ప్రభుత్వం చేయకపోవడంతో.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నాలుగు విడతలుగా 7,98,345 గ్రూపులకు రు.25 వేల 570 కోట్ల ఆసరా గా రుణమాఫీ చేసి మహిళా అక్కచెళ్ళమ్మ లకు ఆర్థిక భరోసాను కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఆరోగ్య సంరక్షణ తండ్రి వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రు.2.5 లక్షల రూపాయల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తే, నేడు తండ్రికి తగ్గ తనయుడుగా ఆరోగ్యశ్రీ ద్వారా రు. 25 లక్షల ఖరీదైన వైద్య సేవలను పేర్కొన్నారు.పేదవాడి ఆత్మగౌరవాన్ని మరింత ఇనుముడింప చేసే విధంగా సీఎం జగనన్న అనేక సంస్కరణలు చేపట్టారని అందులో భాగంగానే వాలంటరీ, సచివాలయం వ్యవస్థలను ఇంటి ముందుకే తీసుకొచ్చారన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించే అమ్మ ఒడి అనే ఔషధాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి ఇంగ్లీష్ మీడియంతో కూడిన చదువులు చదివే విధంగా సీఎం బాటలు వేశారని పేర్కొన్నారు. నాడు దేశానికి స్వాతంత్రం సాధనకు మహాత్మా గాంధీ ఎనలేని కృషి చేశారని, ప్రతి ఒక్కరికి సమాజంలో సమాన హక్కుల కలిగి ఉండే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనే గ్రంధాన్ని మనకు అందించి పూల బాట వేశారని మంత్రి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలలో రూ.2 లక్షల 53 వేల కోట్లను వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయగా ఒక బీసీ సంక్షేమానికే ఒక లక్షా 90 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేశామని మంత్రి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, డి ఆర్ డి ఎ పి డి ఎన్ వి ఎస్ మూర్తి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కే ఎన్ జ్యోతి, ఎంపీడీవో ఎం శ్రీనివాసరావు, మండల జెసిఎస్ సెక్రటరీ తాడికొండ విష్ణుమూర్తి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, స్థానిక నాయకులు ముత్యాల పోసుకుమార్, సాధనాల శివ , బొప్పన సుబ్బారావు సచివాలయకన్వీనర్లు,సచివాలయ ఉద్యోగులు, ఆర్‌పీలు,మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *