రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి స్పందన కార్యక్రమం జనవరి 29 సోమవారం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు.రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో స్పందన ఫిర్యాదులు అంద చేయాలని కలెక్టర్ తెలియచేశారు. మండల స్థాయి అధికారులు అందరూ మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించాలన్నారు.
Tags Rājamahēndravaraṁ rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …