– 25 లక్షల రూపాయలతో త్వరలో డ్రైనేజీ నిర్మాణం
-మంత్రి వేణుగోపాలకృష్ణ.
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన శానిటేషన్, పరిశుభ్రత ఎంతో అవసరమని ఆ దిశగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ కాలుష్యం లేని గ్రామాలుగా తీర్చిదిద్దేదుకు ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామపంచాయతీ సమీపంలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య రక్షణకు మెరుగైన శానిటేషన్, మురుగు నీరు పారుదల నిరంత ప్రక్రియని ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ హుక్కంపేట పాత పంచాయతీ వద్ద మురుగు నీరు పారుదలలేని డ్రైనేజీని పరిశీలించి సమస్య పరిష్కార దిశగా అప్పటికప్పుడే డ్రైనేజీ నిర్మాణం కొరకు రు. 20 లక్షల రూపాయలను మంజూరు చేయడంతో పాటు మరో రు.5 లక్షల రూపాయలు గ్రామపంచాయతీ నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరలో చేపట్టడం జరుగుతుందని మంత్రి స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ స్వయంగా పారిశుధ్య కార్మికులతో కలిసి డ్రైనేజీ పూడికతీత కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో శానిటేషన్, డ్రైనేజీ పరిశుభ్రత నిరంత ప్రక్రియ అని ఆ దిశగా అధికారులు కాలుష్యాన్ని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఎంపీడీవో డి. శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ, స్థానిక నాయకులు బొప్పన సుబ్బారావు, సిరా గణేష్, బండి నాగేశ్వర్, పసలపూడి శీను, తదితరులు పాల్గొన్నారు.