Breaking News

భారత దేశ గిరిజనుల చరిత్ర , సంస్కృతి లప్రపంచానికే ఆదర్శం….

-జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల గోడ ప్రతి, కర పత్రాలు ఆవిష్కరణ
-జిల్లా కలెక్టర్ కె.మాధవిలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయాలు దేశానికి పట్టుకొమ్మలు లాంటివి అని వాటిని కాపాడుకోవాల్సిన , భావితరాలకు వారసత్వంగా అందించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఫిబ్రవరి 5 తేదీ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి నన్నయ్య విశ్వవిద్యాలయం లో నిర్వహించ నున్న జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సవాల నిర్వహణా ఒక మంచి కార్యక్రమం అని కలక్టర్ పేర్కొన్నారు. ఆధునికత సోకని గిరిజన కళారూపాలు మన సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతిరూపం అని ఈ సందర్భంగా టీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లి భాస్కర్ , జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్ ,రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప ,రాష్ట్ర కార్యదర్శి విష్ణు నాయక్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించి పోతున్న గిరిజన సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవలని ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభ్యున్నతి కి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్ నాయకులు రాజకుమార్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *