తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ లోని రెవిన్యూ పరిపాలన విభాగము లోని పలు సెక్షన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి , సిబ్బంది, వారి కార్యకలాపాల యొక్క పని తీరును పరిశిలించి దిశా నిర్దేశం చేసి వారి పని తీరు మెరుగు పరచుకోవాలని జిల్లా కలెక్టర్ డా జి . లక్ష్మీ శ అన్నారు.
గురువారం సాయంత్రం డిఆర్ఓ పెంచల్ కిషోర్ తో కలిసి జిల్లా రెవిన్యూ పరిపాలన కార్యాలయ భవన సముదాయంలోని వివిధ సెక్షన్లను తనిఖీ చేసి ఉద్యోగుల యొక్క వివరాలను ఆరా తీశారు. కార్యాలయపు ఫైల్స్ నిర్వహణ పెండింగ్ లో లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఉద్యోగుల యొక్క బయోమెట్రిక్ పని తీరును పరిశీలించారు. వ్యయ ప్రయాసలతో కూడి దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల యొక్క స్పందన అర్జీ ల విషయంలో ఎటువంటి కాలయాపన లేకుండా వారికి తగు పరిష్కారం చూపాలన్నారు. భారత స్వాతంత్రం సిద్ధించడానికి యుద్ద సైనికులు వారి యొక్క విధులను ఎలా నిర్వర్తించారో అలాగే మన రాష్ట్ర విభజన, జిల్లాల విభజన లో కూడా అలాగే ఉద్యోగస్తులు వారి విధులను సమర్ధవంతంగా నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎలక్షన్ సెల్ కు సంబంధించి మాన్ పవర్ మేనేజిమెంట్ సెల్, పి ఓ ఎల్ ఆర్ సంబంధించిన సెక్షన్ లు తనిఖీ చేసి పలు సూచనలను చేసారు. అలాగే డి ఆర్ ఓ ఛాంబర్ మరియు కలెక్టరేట్ కార్యాలయము లో ఉన్న రికార్డు రూమ్ తనిఖీ చేసి, రికార్డులు భధ్రపరచాలని తగు సూచనలు చేసారు.