తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త
తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి చేరుకున్న గౌ. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కి ఆలయ సూపరింటెండెంట్ వాణి, శేషగిరి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
మంత్రి ముందుగా తులాభారం మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా ఆలయ సూపరింటెండెంట్ శేషగిరి ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్ళారు.
అమ్మవారి దర్శనానికి ముందు రేణిగుంట విమానాశ్రయం నందు మంత్రి గారికి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య మరియు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News