Breaking News

జర్మనీ దేశం లో నర్సెస్ గా అవకాశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి)- గాక్ – గో జర్మనీ (GAC – Go Germany) వారి సంయుక్త ఆధ్వర్యంలో ఎఎన్ మ్, జి ఎన్ మ్, బి‌ఎస్‌సి, ఎమ్మెస్సీ నర్సింగ్ చదువుకున్నటువంటి వారికి జర్మనీ భాష ను నేర్పించి వారికి జర్మనీ దేశం లో నర్సెస్ గా అవకాశం కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్, డా .జి. లక్ష్మీ తెలుపుతూ గోడ ప్రతులను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో  ఎ. డి. జ్యోతి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డి ఆర్ డి ఎ, మరియు కన్వీనర్- డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటి వారు మాట్లాడుతూ, ఈ శిక్షణ కొరకు అభ్యర్దులు 20-35 వయస్సు కలిగి జర్మన్ భాష నేర్చుకొనుటకు ఆసక్తి కలిగి, దిగువ తెలిపిన అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి అని పేర్కొన్నారు.

అర్హత ప్రమాణం:
• అభ్యర్థి జర్మనీలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి
• అభ్యర్థి తప్పనిసరిగా నర్సింగ్ గ్రాడ్యుయేట్ (B.Sc నర్సింగ్, M.Sc) లేదా G.N.M , A.N.M చదివి ఉండాలి. మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అర్హులు
• అభ్యర్థి వయస్సు 20 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
• తిరుపతి లో నిర్వహించబడే A1, A2, B1, B2 స్థాయి వరకు జర్మన్ భాషా శిక్షణను GAC గో జర్మనీ, న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్, తిరుపతి నందు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన వారు
అవసరమైన పత్రాలు: రెజ్యూమ్ & ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు,చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఇతర ధృవీకరణ పత్రాలు తీసుకొని పైన తెలిపిన ట్రైనింగ్ సెంటర్ నందు హాజరు కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, ఆర్. లోకనాధం మాట్లాడుతూ మూడు నెలలు జర్మనీ భాష పై శిక్షణ, వసతినీ, ఇతర సదుపాయాలపై,గవర్నమెంట్ 50% భరిస్తుంది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కింద తెలిపినా రిజిస్ట్రేషన్ లింక్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్యాక్ గో జర్మనీ ప్రతినిధి, దిలీప్ మాట్లాడుతూ, ఈ శిక్షణలో ఉతిర్ణత సాధించిన వారికి నెలకు 2లక్షల రూపాయల జీతంతో జర్మనీ దేశం నందు ఉద్యోగ అవకాశాలను దక్కించుకుంటారు అని తెలిపారు.

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12-02-2024,
రిజిస్ట్రేషన్ నమోదు లింక్: www.apssdc.in/home/onlineProgramRegistration

ఇతర వివరాలకు 9505353545 , 9988853335 నంబర్‌కు సంప్రదించవచ్చును.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *