-భీష్మ ఏకాదశి రోజున జనార్ధన స్వామిని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతం
-రథోత్సవం లో పాల్గోన్న మంత్రి వేణు, కుటుంబ సభ్యులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరం లోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును పురస్కరించుకుని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ జనార్ధన స్వామి ఆలయాన్ని మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవం లో సతి సమేతంగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా మంత్రి వేణు గోపాల్ కృష్ణ మాట్లడూతూ, హిందువులకి అత్యంత పవిత్రమైన రోజు భీష్మ ఏకాదశి అన్నారు. ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకూ తొమ్మిది జనార్ధన స్వామి ఆలయాలు ఉంటే , వాటిలో ప్రథమం ఆలయం ధవళేశ్వరం ఆలయం అన్నారు. ఈ రథోత్సవం కార్యక్రమములో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతం అని పేర్కొన్నారు. ప్రజలకి మంచి జగరాలని శ్రీ జనార్ధన కోరుకోవడం జరిగిందని మంత్రి తెలియ చేశారు.